ఏపీ సీఎం జగన్‌ను మానవబాంబుగా మారి చంపేస్తానన్న యువకుడి కేసులో సదరు యువకుడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అదేసమయంలో పోలీసులపై కోర్టు ఫైరైంది. వివరాలు..మానవబాంబుగా మారి సీఎం జగన్‌ను చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని.. సీఐడీ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 16న ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారించారు.
అయితే, వెంటనే ఫణి ఆ పోస్టు డిలీట్ చేయడంతో పాటు.. నిందితుడు ట్విటర్ అకౌంట్ మూసేశాడు. ఫోన్ కూడా స్విచాఫ్ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫణిని పోలీసుల అరెస్టు చేశారు. నిందితుడు జనసేన మద్దతుదారుడని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ కేసును విచారించిన గుంటూరు 6వ అదనపు కోర్టు ఫణికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఫణి రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది. సీఎంను చంపుతానని పోస్టులు పెట్టినట్లు పవన్ ఫణిపై నమోదైన కేసు సెక్షన్లపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు.
ఆధారాలు లేకుండా... రాజద్రోహం, ప్రభుత్వంపై యుద్ధం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేయటాన్ని ప్రశ్నించారు. నిందితుడిని జైల్లో ఉంచాలనే ఇలాంటి సెక్షన్లు పెట్టారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో ఫణికి బెయిల్ లభించింది. అయితే.. మరోవైపు ఫణికి జనసేనతో సంబంధాలు ఉన్నాయన్న పోలీసుల వ్యాఖ్యలను జనసేన పార్టీ తోసిపుచ్చింది. సీఎంను చంపుతానని పోస్టు చేసిన ఫణికి, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అభిమాని ముసుగులో పోస్టులు చేసేవారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని.. వాస్తవ, విశ్లేషణాత్మక, చైతన్యపరిచేలా పోస్టులు ఉండాలని వివరించింది.