'పఠాన్' ను ఎత్తి పడేసి కాళ్లతో తొక్కి బహిష్కరణ..!

Update: 2023-01-05 05:05 GMT
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తాజా చిత్రం పఠాన్ విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది వివాదం పెరుగుతోంది. షారుఖ్ ఖాన్‌ నుండి చాలా సంవత్సరాల తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో ఆయన అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా పఠాన్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ సమయంలో బేషరమ్‌ రంగ్‌ పాట వివాదం సినిమాకు పెద్ద డ్యామేజీ చేస్తుంది.

బేషరమ్ రంగ్‌ పాటలో దీపికా పదుకునే యొక్క కాస్ట్యూమ్స్ మరియు ఆమె హావభావాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ చాలా మంది ఆ పాట పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు కూడా ఆ పాటలోని దీపికా బికినీ మరియు ఇతర విషయాల గురించి స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు.

పాటకు వస్తున్న విమర్శలు మరియు ఆందోళన నేపథ్యంలో షారుఖ్‌ ఖాన్‌ ఇప్పటికే కొన్ని దీపికా యొక్క షాట్స్ ను తొలగించారట. సినిమా యొక్క టీజర్‌ విడుదల కాబోతున్న ఈ సమయంలో మళ్లీ రచ్చ జరుగుతోంది. తాజాగా అహ్మదాబాద్‌ లో ఆల్ఫావన్ మాల్‌ లో ఏర్పాటు చేసిన పఠాన్ యొక్క హోర్డింగ్‌ మరియు ఫ్లెక్సీ లను హిందూ సంస్థ బజరంగ్ దళ్‌ సభ్యులు తొలగించారు.

మాల్‌ లోకి ప్రవేశించిన పదులకొద్ది బజరంగ్ దల్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పఠాన్‌ పోస్టర్స్ ను చించి నేలపై పడేసి కాళ్లతో తొక్కారు. సినిమాను ఆల్ఫావన్ లో ప్రదర్శించకూడదు అంటూ విజ్ఞప్తి చేశారు. సినిమా ను రాష్ట్ర వ్యాప్తంగా బహిష్కరించాలి అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఉత్తర భారతంలో పఠాన్ సినిమాకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే మధ్య ప్రదేశ్‌ మంత్రి నరోత్తం మిశ్రా ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దాంతో మధ్య ప్రదేశ్‌ లో సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ యూనిట్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీరో సినిమా తర్వాత షారుఖ్ ఖాన్‌ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో ఆసక్తి నెలకొంది. షారుఖ్ సక్సెస్ దక్కించుకుని చాలా సంవత్సరాలు అయ్యింది. కచ్చితంగా ఆయన ఈ సినిమా తో సక్సెస్ అవుతాడు అంటూ చాలా నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ సినిమా వివాదం వల్ల కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తారీకున సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. తెలుగు లో కూడా పఠాన్ విడుదల కాబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News