ఆనందయ్య మందు పై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు .. ఏమన్నాడంటే ?

Update: 2021-05-28 05:30 GMT
దేశంలో కరోనా విజృంభణ సమయంలో ఒక్క  ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా , పలు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన  ఆనందయ్య కరోనా నాటు మందుపై తెలుగు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా  స్పందించారు. ఈ రోజు  దివంగత ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని అంజలి ఘటించిన తర్వాత, బాలకృష్ణ మాట్లాడుతూ .. ఆనందయ్య మందుపై తనదైన శైలిలో కామెంట్ చేశారు.నాకు నమ్మకం ఉందయ్యా.. అభిమానం లేనిదే ఆరాధన లేదు.. ఆరాధన లేనిదే మతం లేదు. మతం లేనిదే మానవుడే లేడు. అలాగే ప్రతీది ఒక నమ్మకం.. నేను నమ్ముతాను తప్పకుండా… ఎందుకంటే, గొప్పగొప్ప వైద్యులున్నారు. క్రీస్తు పూర్వమే సుశంకుడనే వైద్యుడుండే వాడు.. ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఇవాళ్టికి కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీ లో ఆయన పేరుంది అని బాలయ్య వ్యాఖ్యానించారు.

స్వర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరాడు నందమూరి బాలక్రిష్ణ.   ఎన్టీఆర్ 98వ జయంతి సంధర్భంగా హైదరాబాద్‌‌లోకి ఘాట్‌వద్దకు కార్యకర్తలతో చేరుకుని నివాళులు అర్పించారు.  ఎన్టీఆర్ సినిమాలు చూసి స్పూర్తి పోందానని చెప్పారు. తెలుగు వారు గర్వపడేలా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. మరోవైపు లాక్‌డౌన్ నేపథ్యంలోనే ఎన్టీఆర్ మరోకుమారుడు రామక్రిష్ణ మాత్రం ఇంటివద్దే నివాళులు అర్పించినట్టు చెప్పారు. కరోనా కారణంగా ఘాట్‌వద్దకు వెళ్లలేకపోయానని చెప్పారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు ఎన్టీఆర్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్టీఆర్ తెలుగువారికి స్పూర్తి అని చెప్పారు..దీంతో పాటు ఆయన తెలుగువారి ఆస్తి అని వ్యాఖ్యానించాడు.
Tags:    

Similar News