ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఆదివారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 45 రోజులుగా పది దేశాల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ మహా సంగ్రామంలో అసలు విజేత ఎవరో ఆదివారం తేలిపోతుంది. ఫైనల్లో ఆతిధ్య ఇంగ్లండ్ జట్టుతో న్యూజిలాండ్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ రెండు జట్లు గతంలో ఫైనల్ కు చేరుకున్నా ఒక్కసారి కూడా కప్ సాధించలేదు. తాజా ఫైనల్లో ఎవరు గెలిచినా ఈసారి మనం సరికొత్త క్రికెట్ ఛాంపియన్ ను చూడబోతున్నాం. ఈ సారి మాత్రం న్యూజిలాండ్ కప్ గెలుస్తుందన్న వాదన తెరమీదకు వచ్చింది. ఇది ఎవరో క్రీడా విశ్లేషకులు చెపుతోన్న మాట కాదు.. తమిళనాడుకు చెందిన ఓ జ్యోతిష్యుడు చెపుతోన్న మాట.
నాలుగు జట్లు- భారత్ - ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరుకుంటాయని తమిళ జ్యోతిష్యుడు బాలాజి హాసన్ ముందే అంచనావేయడం విశేషం. సెమీస్లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుందని...అందులో న్యూజిలాండ్ గెలుస్తుందని కూడా ఆయన అంచవేశాడు. బాలాజి హాసన్ చెప్పినట్లే సెమీస్ లో భారత్ ఓడిపోగా...న్యూజిలాండ్ ఫైనల్ కు చేరింది. ఈ మాట ఆయన ఎప్పుడో ఆరు నెలల క్రితమే చెప్పగా.. అది ఓ తమిళ్ ఛానెల్లో ప్రసారమైంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
ఇక రెండు రోజుల క్రితం జరిగిన ఫేస్ బుక్ లైవ్ లో కూడా ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్ చేరుతుందని చెప్పగా అది కూడా నిజం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ కు షాక్ తప్పదని.. విజేత న్యూజిలాండే అని బాలాజీ చెపుతున్నారు. ఇక బాలాజీ గతంలోనూ చెప్పిన జోస్యాలు నిజం అవ్వడంతో ఇప్పుడు తాజా జ్యోతిష్యంపై అందరూ ఆసక్తితో ఉన్నారు.
ఇక రాజకీయాలపై కూడా ఆయన తన జ్యోతిస్యాన్ని వెల్లడించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 2022లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని...2024 తర్వాత రాజకీయాల్లో ఉండబోరని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై స్పందిస్తూ త్వరలోనే కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. మరి బాలాజీ హాసన్ ప్రపంచకప్ జోస్యం ఎంత వరకు నిజం అవుతుందో ? మరి కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.