సావిత్రి ఆడియో వేడుకలో 'అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి... కడుపుపైనా చేసేయాలి. కమిట్ కమిట్' అంటూ వెళ్లి పోవాలి అని వ్యాఖ్యలు చేశారు బాలయ్య. ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యల చుట్టూ.. వివాదం నెలకొంది. మహిళా సంఘాలు - లాయర్లూ.. కేసుల వరకూ వెళ్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనపై హైదరాబాద్ సరూర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ పరిస్థితిని గ్రహించిన బాలకృష్ణ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకొన్నారు.
ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావని, ఏ ఇంటి అమ్మాయి అయినా, తన ఇంటి ఆడబడుచే అని చెప్పుకొచ్చారాయన. ఇతరులను గౌరవించడం - మహిళలను తోబుట్టువులుగా చూడడం నా తండ్రి నుండి నాకు వారసత్వంగా సంక్రమించిన గుణం. సావిత్రి ఆడియో ఫంక్షన్ లో తాను సరదాగా మాట్లాడానని.. ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే మన్నించమన్నారు బాలయ్య. మహిళా దినోత్సవ సందర్భంగా రెండు రాష్ట్రాల ఆడపడుచులకు నా శుభాకాంక్షలు అని తెలిసి బహిరంగంగానే క్షమాపణలు కోరారు.