హిందూపురం శాసనసభ్యుడు, హీరో బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో అనుకోని ఇబ్బంది ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారని చెప్పినా బాలకృష్ణ అలా చేయకపోవడంతో దళితులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంబేద్కర్ ను అవమానించారని ఆరోపిస్తూ మంగళవారం ధర్నాకు దిగారు.
హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పొల్గనడానికి బాలయ్య వెళ్లారు. లేపాక్షి మీదుగా హిందూపురం వెళ్లేటప్పుడు అక్కడ జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తారని షెడ్యూల్ లో ఉంది. కానీ బాలయ్య అదే మార్గంలో వెళ్లినా అక్కడ ఆగలేదు. కానీ బాలకృష్ణ వస్తారని చెప్పడంతో దళితులు విగ్రహాన్ని పూలమాలలో అలంకరించి ఆయన కోసం ఎదురు చూశారు. బాలకృష్ణ నిరాశపరచయడంతో వారిలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప లేపాక్షికి వచ్చి వారికి నచ్చజెప్పి విగ్రహానికి నివాళులు అర్పించి వెళ్లారు.