గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ కు సంబంధం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యల అనంతరం పవన్ పై చంద్రబాబు - లోకేష్ లతో పాటు మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందించారు. తాజాగా, పవన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే , సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. పవన్ మాట్లాడిన దానిపై స్పందించి అతడిని హీరో చేయడం తనకిష్టం లేదన్నారు.
శనివారం నాడు బాలకృష్ణ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి ఒక్కటే ఎజెండా అని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఎవరెవరో ఏవేవో విమర్శలు చేస్తుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ పై ఏదో మాట్లాడి అతడిని హీరోని చెయ్యడం తనకు ఇష్టంలేదని అన్నారు. ``ఇప్పటికీ, ఎప్పటికీ మేమే హీరోలం’’ అని పవన్ వ్యాఖ్యలపై బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. కొద్ది రోజుల క్రితం కూడా పవన్ ఎవరో తనకు తెలీదని బాలకృష్ణ వ్యాఖ్యానించినట్లు ఓ మీడియా చానెల్ లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే.