ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు.. బాలక్రిష్ణ ఎంట్రీ!

Update: 2020-07-24 16:30 GMT
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వివాదాస్పదమైంది. స్థానిక ముసునూరులో మహాలక్ష్మమ్మ ఆలయ స్థలంలో ఆలయానికి ఎదుట రెండేళ్ల క్రితం ఓ టీడీపీ నేత ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. దాన్ని వైసీపీ ఎమ్మెల్యే తొలగించి వైఎస్ఆర్ విగ్రహం ప్రతిష్టించేందుకు ప్రయత్నాలు చేశారు.

దీంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అధికార వైసీపీ ఎమ్మెల్యేతోపాటు నేతలపై మండిపడ్డారు.

ఇక తన తండ్రి, దివంగత ఎన్టీఆర్ విగ్రహ తొలగింపుపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలక్రిష్ణ స్పందించారు. గురువారం బాలక్రిష్ణ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అడిగారు. దీంతో వాస్తవ పరిస్థితులను వివరించి కొత్తగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నామని.. ఆ విగ్రహాన్ని తీసిన చోటే ప్రతిష్ట చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఫోన్ లో బాలయ్యకు హామీ ఇచ్చారు. దీంతో రామిరెడ్డి చొరవను బాలయ్య అభినందించినట్టు తెలిసింది. దీంతో ఎన్టీఆర్ విగ్రహ తొలగింపు వివాదం సద్దుమణిగింది.
Tags:    

Similar News