అన్న సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీలో ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి ఒక్కరే ఉన్నారు. అదే బాలయ్య. కానీ ఆయన లీడ్ చేయడం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి.. 2024 వరకు చంద్రబాబు వచ్చే వృద్ధాప్యం.. లోకేష్ శక్తి సామర్థ్యాలపై అపనమ్మకం నేపథ్యంలో చరిష్మా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని లీడ్ చేయాలని టీడీపీ శ్రేణులు - నాయకుల మనుసులో ప్రబలంగా కోరిక ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తానంటే చంద్రబాబు అండ్ ఫ్యామిలీ రానిస్తుందా లేదా అన్నది సస్పెన్స్.
అయితే ఇదే ప్రశ్నను నారా లోకేష్ తోడల్లుడు.. బాలయ్య రెండో అల్లుడు అయిన భరత్ ను అడిగితే హాట్ ఆన్సర్ ఇచ్చారు. ఇటీవలే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరుఫున విశాఖ పార్లమెంట్ సీటుపై పోటీచేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ‘చంద్రబాబు - బాలయ్య - లోకేష్ - మేమంతా ఉన్నాం కదా.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదు’ అని హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడీ మాటలు వైరల్ అయ్యాయి..
2009 ఎన్నికల వేళ టీడీపీ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ తర్వాత సమీకరణాల్లో చంద్రబాబు ఆయనను దూరం పెట్టారని.. అందుకే పూర్తిగా టీడీపీకి దూరం జరిగాడని వార్తలొచ్చాయి.లోకేష్ కు పోటీవస్తాడనే జూనియర్ ను దూరం పెట్టారన్న విమర్శలు వచ్చినా దగ్గరకు తీయలేదు.
అయితే తాజాగా బాలయ్య చిన్నల్లుడు భరత్ మాటలు టీడీపీలో మంటలు పుట్టించాయి... ‘టీడీపీకి చరిష్మా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి నేతలు అవసరం లేదు’ అని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బాగుపడుతుంది.. ఆయనతోనే పార్టీ గెలుస్తుందని తాను అనుకోవడం లేదన్నారు.. ఆయనతోనే పార్టీకి జవసత్వాలు నింపే సామర్థ్యం ఉందని అనుకోను అని జూనియర్ పై కామెంట్ చేశారు. తెలుగు దేశం పార్టీయే సుప్రీం అని.. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్, పాపులర్ అయినా ఆయనతో మార్పు రాదని.. పార్టీకి జూనియర్ అవసరం లేదని.. చంద్రబాబు - లోకేష్ టీడీపీ నేతలు చాలు అని స్ఫష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తోనే పార్టీ బాగుపడుతుందని తాను నమ్మడం లేదని పేర్కొన్నారు.
కాగా జూనియర్ ఎన్టీఆర్ ను తీసిపారేసినట్టు బాలయ్య అల్లుడు మాట్లాడిన తీరుపై నందమూరి ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. కనీసం ఎంపీగా కూడా గెలవలేని బాలయ్య అల్లుడు భరత్ జూనియర్ పై కామెంట్ చేయడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీన్నే బట్టే చంద్రబాబు - బాలయ్య ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని అర్థమవుతోందని మండిపడుతున్నారు. మరి ఈ టీడీపీ ఫ్యామిలీ పంచాయతీ చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.
Full View