టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ అవుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని కీలకమైన రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక టీడీపీకి తలకుమించిన భారమవుతోంది. తాజాగా రాజమండ్రి ఎంపీ టికెట్ పై బాలక్రిష్ణ అల్లుడు శ్రీభరత్ ను పోటీచేయిస్తే ఎలా ఉంటుందంటూ టీడీపీ అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలిసింది.
కొద్దిరోజులుగా పార్టీ ముఖ్యల నుంచి ఫోన్ల ద్వారా ఈమేరకు నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ చేపడుతున్నారట.. బాలయ్య అల్లుడు భరత్ లోక్ సభకు పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. ఆయన విశాఖ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అయితే అక్కడ పోటీ ఎక్కువగా ఉండడం.. బాలయ్య అల్లుడు కావడంతో భరత్ ను రాజమండ్రి నుంచి పోటీచేయించాలని టీడీపీ యోచిస్తోందట..
రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ ఈసారి లోక్ సభకు పోటీచేయబోనని ప్రకటించడంతో ఇక్కడ టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. దీంతో మొదట మురళీ మోహన్ కోడలు రూపాదేవిని తెరపైకితెచ్చారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ పేర్లు పరిశీలించారు. కానీ ఇప్పుడు శ్రీభరత్ నే బరిలోకి దించితే గెలుస్తాడా అన్న దానిపై సర్వే చేస్తున్నట్టు సమాచారం.
ఇక నరసాపురం లోక్ సభ సీటుపై కూడా టీడీపీలో పీఠముడి నెలకొంది. సీతారామలక్ష్మి - కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్లు మొదట ప్రతిపాదించారు. వీరిద్దరూ పోటీచేయడానికి సాహసించలేదు. ఆతర్వాత డీసీసీబీ అధ్యక్షుడు ముత్యాల రత్నంకు టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ నేత గోకరాజు రామంను కూడా పార్టీ మార్పించి పోటీచేయిద్దామని అనుకున్నారట.. కానీ ఎవ్వరూ ఫైనల్ కావడం లేదని సమాచారం.
ఇక ఏలూరు లోక్ సభ స్థానానికి మాగంటి బాబును ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. భోళ్ల రాజీవ్ కూడా మాగంటి బాబుకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నారు. మాగంటికి ఏలూరు లోక్ సభ లేదా కైకలూరు ఇస్తారని చెబుతున్నారు. ఎంపీ ఇస్తారా.? అసెంబ్లీకి పంపిస్తారా అన్నది రెండు మూడు రోజుల్లోనే తేలనుంది.