ప్రముఖ హీరో - అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజవకర్గంలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు అభివృద్ధి పనులకూ శంకుస్థాపనలు చేశారు. శనివారం ఆయన హిందూపురంలో హల్ చల్ చేశారు. ఆటోనగర్ నుంచి స్వయంగా బుల్లెట్ నడుపుతూ సందడి చేశారు. దీంతో అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పురపాలక ఉద్యానవనాన్ని ప్రారంభించారు. పార్కులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి - క్షీరాభిషేకం చేసి - నివాళి అర్పించారు. అనంతరం - బసవనపల్లి పాఠశాలలో రూ. 39 లక్షలతో నిర్మించిన భవనాలనూ ఆయన ప్రారంభించారు. శుక్రవారం కూడా బాలయ్య శంకుస్థాపనలు - భూమిపూజలతో బిజీగా గడిపారు. రంగనాథ ఆలయంలో పుష్కరిణి - కోనేరు పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. శనివారం కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.
కాగా బాలయ్య తాజా సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మాణం శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు, అభిమానులు బాలయ్య కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బాలయ్య బుల్లెట్ పై కనిపించడంతో హిందూపురం ప్రజలు.. గౌతమీపుత్ర శాతకర్ణి బుల్లెట్ పై వస్తున్నాడంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/