క‌రోనా ఎఫెక్ట్‌లో కేసీఆర్‌కు ద‌క్కిన గౌరవం ఏంటంటే..

Update: 2020-09-03 17:30 GMT
న‌వ‌రాత్రి ఉత్స‌వాలంటే హైద‌రాబాద్‌లో రెండు చోట్ల వినాయ‌కుడి సంద‌డిపై అంద‌రి చూపు ప‌డుతుంది. ఖైర‌తాబాద్ వినాయ‌కుడు ఒక‌టైతే బాలాపూర్‌లో లంబోధ‌రుడి ల‌డ్డూ మ‌రొక‌టి. అయితే, కరోనా ఎఫెక్ట్ నవరాత్రి ఉత్సవాలపై పడింది. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. దీంతో ఖైరతాబాద్ గణనాథుడి పరిమాణం సైతం తగ్గిస్తూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. అదే ఒర‌వ‌డిలో బాల‌పూర్ గ‌ణేష్ నిర్వాహ‌కులు సైతం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

క‌రోనా పుణ్య‌మా అని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకునే నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జరిగాయి. తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశాల నేప‌థ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తక్కువ మండపాలను ఏర్పాటు చేశారు. నిమర్జనం సందర్భంగా కుడా కరోనా సందర్బంగా ఆంక్షలను పాటించారు. ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డు కోసం వేలం లో ప్రజలు పోటీ పడుతూ వేలం పాడుతారు. 1994లో బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ మొదలైంది. మొదటి సంవత్సరం లడ్డూ 450 పలికింది. ప్ర‌తి ఏడాది ధ‌ర పెరుగుతూ వ‌స్తోంది. దాంతో లడ్డు రికార్డు ధరకు పలుకుతుంది. గతేడాది బాలపూర్‌ లడ్డూ ఏకంగా 17 లక్షల 67వేలు పలికింది.

అయితే, బాలాపూర్ లడ్డుపై సైతం కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది ల‌డ్డూ వేలం వేయ‌కూడ‌ద‌ని నిర్వాహ‌క క‌మిటీ నిర్ణ‌యించింది. కరోనా నేపథ్యంలో బాలాపూర్‌ గణనాథుడి లడ్డూ వేలంపాటను రద్దు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్‌కు బాలాపూర్ లడ్డూను గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందజేశారు. ప‌్ర‌గ‌తి భ‌వ‌న్‌లో విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మ‌క్షంలో ల‌డ్డూను కమిటీ స‌భ్యులు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అంద‌జేశారు.
Tags:    

Similar News