పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ బలోపేతం కాదని, ఇటీవల నిర్వహించిన సర్వే అంతా బోగస్ అని విమర్శించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పీసీసీ ఛీప్‌కు మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ - పీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి - మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి - పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారంతా కోమటిరెడ్డిని కేసీఆర్ మనిషిగా చెప్పడం గమనార్హం. జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ లో చీలిక తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ బలోపేతంపై కేసీఆర్ అభద్రతలో ఉన్నాడని, కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నాడని జగ్గారెడ్డి విమర్శించారు. కోమటిరెడ్డిది క్రమశిక్షణ ఉల్లంఘనేని, కోమటిరెడ్డి పై చర్య తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ కుట్రపూరితంగా కాంగ్రెస్ ను దెబ్బ తీసేలా కోమటిరెడ్డి లాంటివారిని ఉసిగొలుపుతున్నారని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఆరోపించారు. కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంటూ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారో పార్టీ అంతర్గత సమావేశంలో చర్చిస్తామని, వివరణ కోరుతామని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని పీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి అన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడినట్లుగా ఉన్నాయని మండిపడ్డారు. కోమటిరెడ్డి పార్టీ గీత దాటి మాట్లాడటం ఇది రెండవసారని మల్లు రవి తెలిపారు. పార్టీ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే చేయిస్తే .. దాన్ని బోగస్ సర్వే అంటూ మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. పార్టీ క్యాడర్ మనోధైర్యం దెబ్బతినేలా కోమటి రెడ్డి మాట్లాడారని, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానానికి పిర్యాదు చేస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. మరోవైపు పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి పార్టీకి విఘాతం కలిగించేలా మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఉండి మంత్రి పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీకి అస్తిత్వం కలిగించేలా కోమటిరెడ్డి మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. వ్యక్తిగత ఆధిపత్యం కోసం పాకులాడటం సరికాదని తెలిపారు. కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినేలా కోమటిరెడ్డి ప్రవర్తించాడని, కోమటిరెడ్డి ది ముమ్మాటికీ క్రమశిక్షణ ఉల్లంఘనేనని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/