భారీ అంచనాల మధ్య విడుదలైన మహానాయకుడు అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. కనీసం కథానాయకుడు సినిమాుక అయినా ఓపెనింగ్స్ వచ్చాయేమో కానీ.. మహానాయకుడు సినిమాకు అయితే మరీ ఘోరం. మండపేట లాంటి సెంటర్లలో టిక్కెట్లు అమ్ముడు అవ్వలేదని షోనే క్యాన్సిల్ చేశారు. నిజాన్ని చూపించకుండా పైపైన చుట్టేయడంతో.. సినిమా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. అన్నింటికి మించి మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్‌ని కాకుండా చంద్రబాబుని హీరోని చెయ్యడం కూడా సినిమా ఫ్లాప్‌కు మరో కారణం.
మహానాయకుడు సినిమా ఫ్లాప్ ఏమో కానీ.. ఈ సినిమా మాత్రం టీడీపీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుకి పెద్ద ప్రతిష్టగా మారింది. పార్టీ వ్యవస్థాపకుడు, తన మామగారు అయిన ఎన్టీఆర్ జీవితంపై వచ్చిన సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అదీగాక.. ఎన్టీఆర్ చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకు మహానాయకుడు సినిమా ఉపయోగపడుతుందని గత కొన్ని రోజులుగా చంద్రబాబు చెప్తూ వస్తున్నారు. దీంతో.. సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు తన అనుకూల వర్గాన్ని రంగంలోకి దింపారు.
మహానాయకుడు సినిమాకు టిక్కెట్లు తెగినా తెగకపోయినా… మరో 50 రోజుల పాటు థియేటర్లలో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకోసం టీడీపీ నాయకులే టిక్కెట్లు కొని హౌస్‌పుల్ చేయాలని.. అలా 50 రోజులు ఆడించిన తర్వాత సినిమా సూపర్‌హిట్ అని ప్రకటించే అలోచనలో ఉన్నారట చంద్రబాబు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. 50 రోజులు ఆడిస్తే.. ఎన్నికల టైమ్‌కు మహానాయకుడు థియేటర్లలో ఉంటుంది. అది పార్టీకి, పార్టీ విజయానికి హెల్ప్ అవుతుంది.