వారంతా ఉన్నత విద్య అభ్యసించిన వారు. భారత మూలాల నుంచి ఎదిగిన వారు. కులం, మతం అనే భేషజాలు లేకుండా.. పాఠశాలల్లో చదివి.. ఉన్నత శిఖరాలకు చేరుకుని అగ్రరాజ్యంలో అడుగు పెట్టినవారు. అందుకే.. ఎన్నారైలు అంటే.. భారతీయులు పడి చచ్చిపోతారు. వారి విషయంలో ఎంతో గౌరవ భావం ప్రదర్శిస్తారు. కానీ, అలాంటి ఎన్నారైలు..చిల్లర వేషాలు వేస్తే .. ఎలా ఉంటుంది? అలాంటి ఎన్నారైలు.. కులాల పేరిట విడిపోతే ఎలా ఉంటుంది? ఇదిగో.. ఇలానే ఉంటుంది.
ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లో నందమూరి బాలకృష్ణ, మెగా స్టార్ చిరంజీవి అభిమానులు.. రగడకు దిగారు. న్యూఇయర్ వేడుకలో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించిన అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు.. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. కులాల రొచ్చును సృష్టించారు. కటౌట్లు పట్టుకుని యువత చెలరేగిపోయారు. విమర్శలు చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర రచ్చకు దారితీసింది.
అరె.. అమెరికాలో ఉన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా ఉండాల్సిన.. వారు ఇలా .. చిల్లర వేషాలకు దిగుతారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. నిజానికి కులాల విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేవరకు.. అన్ని కులాలవారితోనూ.. ప్రతి ఒక్కరికీఅనుబంధం ఉంటుంది. తినే తిండిని పండిచే రైతు నుంచి పాఠాలు చెప్పే టీచర్ల వరకు.. మన కులం వారే కావాలని.. ఎవరైనా అంటే అంతకు మించిన అజ్ఞానం లేదు.
అంతేకాదు.. మనం వేసుకునే దుస్తుల నుంచి తొడిగే పాదరక్షల వరకు.. ఏ కులం వారు తయారు చేశారు..? ఎవరు అమ్ముతున్నారు? అని తరచి చూస్తే.. ఎవరిదని చెప్పగలరు. అలాంటిది సినిమాల విషయానికి వచ్చేసరికి.. ఈ కులాల కుమ్ములాటలు ఎందుకు? అనేది నెటిజన్ల ప్రశ్న. పైగా ఇక్కడ.. మరో కీలక విషయం కూడా చర్చకు వస్తోంది. సినిమాలో పనిచేస్తున్నవారంతా.. హాయిగా కలిసిమెలిసి ఉంటున్నారు. వారి మధ్య లేని విభేదాలు.. వివాదాలు.. అభిమానులకు అవసరమా? అనేది ప్రశ్న.
నిజానికి అమెరికా వెళ్లడం అనేది చాలా మంది కోరిక. కానీ, ఎంతమందికో తీరని కల. అలాంటి చక్కని అవకాశం దక్కించుకున్న వీరంతా సినిమాలకు కులాలను అంటగట్టి.. ఇలా రచ్చ చేసుకోవడం అంటే.. ఇదేనా తెలివి? అనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.
మినిమం కామన్ సెన్స్ లేకుండా అమెరికాకు వెళ్లి సత్తా చూపాల్సిన చోట చిల్లర గొడవలు పెట్టుకుంటారా? అని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. మీ చదువు సంస్కారం ఇండియా లాకర్లలోనే దాచి అక్కడికివెళ్లారా? అని ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View