ఉచితాలు అనుచితాలంటూ..దేశవ్యాప్తంగా ఒక చర్చజరుగుతూనే ఉంది. కానీ, ప్రాంతీయపార్టీలు, మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటున్న పార్టీలు మాత్రం ఉచితాలే తమకు కలిసి వస్తున్నాయని ప్రకటిస్తున్నాయి. వాటినే నమ్ముకుని మళ్లీ మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పింఛన్లు కూడా ఇస్తున్నారు. గతంలో రిటైరైన ఉద్యోగులకు మాత్రమే ఉండే పింఛన్లు.. తర్వాత వృద్ధులకు, వితంతువులకు వచ్చాయి. దీనిని అర్ధం చేసుకోవచ్చు. వృద్ధులకు పోషణ భారమైన నేపథ్యంలో వారిని ప్రభుత్వం ఆదుకోవడం మంచిదే.
ఇక, కుటుంబ బాధ్యతను నెత్తికెత్తుకోవాల్సిన స్థితిలో భర్త మరణించిన భార్యకు ఆసరా ఉండడం కూడా ప్రభుత్వం బాద్యతగా తీసుకుని పింఛన్లు ఇవ్వడం మంచి పరిణామమే. కానీ, ఇక, ఇక్కడ నుంచి విపరీత దోరణులు ముందుకు వచ్చాయి. ట్రాన్స్ జెండర్లకు, వివిధ వృత్తి కళాకారులకు, ఒంటరి మహిళలకు ఇలా.. సమాజంలోని ఇతర వర్గాలకు కూడాపింఛన్లను అమలు చేయడం ప్రారంభించారు. ఇదంతా కూడా ఆయా పార్టీలకు ఓటు బ్యాంకుగా మారుతుందనే ఉద్దేశంతోనే ఇలా చేశారనేది వాస్తవం. ఇప్పుడు ప్రభుత్వాలు అప్పులు చేసే పరిస్థితి వచ్చినా.. వాటిని తొలగించే సాహసం చేయలేని పరిస్థితి.
ఇదిలావుంటే.. ఇప్పుడు మరోవర్గం తెరమీదికి వచ్చింది. తమకు కూడా పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు.. పింఛను ప్రకటిస్తేనే తాము ఎన్నికల్లో ఓటు వేస్తామని కూడా ప్రకటించింది. మరి ఇదేంటో చూద్దాం..
బట్టతల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 6000 పెన్షన్ అందజే యాలని బట్టతల బాధితుల సంఘ౦ తెలంగాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తాజాగా కోహెడలో బట్టతల బాధితుల సంఘం భేటీ అయి.. తమ సమస్యలపై చర్చించింది. బట్టతల సంఘం మొదటి అధ్యక్షులుగా వెల్ది బాలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, బట్టతల బాధితులకు రూ.6000 పింఛన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.
సమాజంలో బట్టతల బాధితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని మానసిక వికలాంగుల కింద బట్టతల బాధితులను పరిగణించి.. సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగలోపు పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో బాధితుల జిల్లా సంఘం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ప్రగతిభవన్ ముట్టడి ఇస్తామని తెలిపారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బట్టతల వ్యక్తులతో కూడిన సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇదీ.. సంగతి!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.