నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి గత కొన్నాళ్లుగా సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అధికారులను అడ్డు పెట్టుకుని ఆయన వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్నారు. దీనివెనుక.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని.. కనీస ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అయినప్పటికీ.. నెల్లూరులో.. చాలా మంది రెడ్డి నేతలు ఉండడంతో పరిస్థితి అందరిదీ అలానే ఉంది.
ఇక, ఈ విషయంపై తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరిక స్వరంతోనే మాట్లాడారు. నేరుగా పేరు పెట్టి ఆనంను ఆయన తిట్టకపోయినా.. విమర్శించకపోయినా.. పరోక్షంగా మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అదిష్టానంపై.. ఎవరూ అసమ్మతి స్వరం వినిపించినా.. పరిస్థితి ఇలానే ఉంటుందని తేల్చి చెప్పారు. అంతేకాదు.. తానే స్వయంగా వెంకటగిరి ఇంచార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని నియమించేలా చేశానని అసలు గుట్టు చెప్పేశారు.
పార్టీ అధిష్టానంపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పిస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని బాలినేని తేల్చి చెప్పారు. ఏదైనా ఉంటే.. పార్టీలోసీనియర్లు ఉన్నారు.. పార్టీ అదినేత కూడా అందుబాటులోనే ఉన్నారు.. ఆయనకు చెప్పుకొనే అవకాశం సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
పార్టీలో అసమ్మతిని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటోందని.. ఎవరూ కట్టుదాటొద్దని హెచ్చరించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. ఆనంకు ఎసరు పెట్టింది.. పెడుతోంది.. కూడా సొంత పార్టీ నాయకులే అని.. ఆయన వర్గం ఆరోపించడం కొసమెరుపు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.