బాల్క...టీఆర్ ఎస్‌ ను అడ్డంగా బుక్ చేశారే!

Update: 2018-01-13 10:34 GMT
టీఆర్ ఎస్ స‌ర్కారును గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌న‌కు రాజ‌కీయ ఓన‌మాలు నేర్పిన టీడీపీని వ‌దిలేసి... కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ నేత రేవంత్ రెడ్డి నిజంగానే త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. అధికార పార్టీపై త‌న‌దైన శైలిలో ప‌క్కా ఆధారాల‌తోనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న రేవంత్ రెడ్డి... త‌న‌కు ఎదురు నిల‌చే నేత టోట‌ల్ టీఆర్ ఎస్‌ లోనే లేరన్న రీతిలో స‌త్తా చాటుతున్నారు. అస‌లు తాను విసురుతున్న స‌వాళ్ల‌కు స‌మ‌గ్ర వివ‌ర‌ణ‌తో కూడిన స‌మాధానం ఇచ్చే ద‌మ్ము కూడా టీఆర్ ఎస్‌ కు లేద‌న్న రీతిలో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి నిజంగానే కొత్త ఊపిరి వ‌చ్చేసింద‌నే చెప్పాలి. అయినా ఇప్పుడు రేవంత్ గురించి ఇంత గొప్ప‌గా ఎందుకు చెప్పుకోవాల్సి వ‌చ్చిందంటే... రేవంత్ రెడ్డి సంధించిన ఓ స‌వాల్‌ కు స‌మాధానం ఇచ్చేందుకు అంటూ రంగంలోకి దిగిపోయిన టీఆర్ ఎస్ యువ ఎంపీ బాల్క సుమ‌న్ త‌న పార్టీని అడ్డంగా బుక్ చేసేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పు అని చెబుతూ బాల్క సుమ‌న్ చూపిన ఓ ప‌త్రం... నిజంగానే టీఆర్ ఎస్‌ ను బోనులో నిల‌బెట్టేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే విష‌యాన్ని గ్ర‌హించిన రేవంత్ రెడ్డి కూడా వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయి.. బాల్క సుమ‌న్‌ కు మైండ్ బ్లాంక‌య్యేలా చేశారు. మొత్తంగా ఈ ఎపిసోడ్‌ లో రేవంత్ రెడ్డి గెలవ‌గా.. విప‌క్షాల విమ‌ర్శ‌ల నుంచి పార్టీని ర‌క్షించేందుకు అంటూ రంగంలోకి దిగిన బాల్క సుమ‌న్ మాత్రం త‌న పార్టీని అడ్డంగా బుక్ చేసేశారు.

ఈ ఎపిసోడ్‌ కు సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే... ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న విద్యుదుత్ప‌త్తి కేంద్రాల్లో త‌యార‌వుతున్న విద్యుత్‌ ను కాద‌ని - ప్రైవేట్ కంపెనీలు ఉత్ప‌త్తి చేస్తున్న విద్యుత్‌ ను కొనుగోలు చేస్తున్న ప్ర‌భుత్వం జ‌నం నెత్తిన ధ‌రాఘాతాన్ని వేస్తోంద‌ని ఆరోపించారు. కేవ‌లం ముడ‌పుల కోస‌మే ప్ర‌భుత్వం సాగిస్తోన్న ఈ దందాలో అధికారులు స‌మిధల‌వుతున్నార‌ని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్ర‌భుత్వం చేసిన త‌ప్పు వ‌ల్ల ప్ర‌స్తుతం 23 మంది అధికారులు జైలుకు వెళ్లే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీఆర్ ఎస్ స‌ర్కారు చేసిన త‌ప్పుకు 23 మంది అధికారుల‌కు ట్రీన్ ట్రిబ్యూన‌ల్ నోటీసులు జారీ చేసింద‌ని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విష‌యంపై ద‌మ్ముంటే బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరిన ఆయ‌న... టీఆర్ ఎస్‌ కు మింగుడుప‌డ‌ని ఆరోప‌ణ‌లే చేశారు. రేవంత్ రెడ్డి దాడి నుంచి పార్టీని ర‌క్షించేందుకంటూ రంగంలోకి దిగిన టీఆర్ ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్ నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో త‌మ త‌ప్పేమీ లేద‌ని - అయినా రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్లుగా 23 మంది అధికారులు జైలుకు వెళ్లే ప‌రిస్థితే లేద‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయితే రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్లుగా 23 మందికి గ్రీన్ ట్రిబ్యూన‌ల్ నోటీసులు జారీ చేయ‌లేద‌ని - ట్రిబ్యూన‌ల్‌ కేవ‌లం ఇద్ద‌రు అధికారుల‌కు మాత్ర‌మే నోటీసులు జారీ చేసింద‌ని ఆయ‌న చెప్పారు. బాల్క సుమ‌న్ నోట నుంచి ఈ మాట వినిపించిందో - లేదో వెంట‌నే రంగంలోకి దిగేసిన రేవంత్ త‌న‌దైన శైలిలో మాట‌ల తూటాలు పేల్చారు. టీఆర్ ఎస్ స‌ర్కారు త‌ప్పు చేసింద‌ని తాను చెప్పాన‌ని - ఆ త‌ప్పు కార‌ణంగా 23 మంది అధికారులు జైలుకు వెళ్లే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తాను చెప్పాన‌ని పేర్కొన్న రేవంత్ రెడ్డి... త‌న ఆరోప‌ణ‌లు ఖండించేందుకు వ‌చ్చిన బాల్క సుమ‌న్ కూడా ఈ విష‌యాన్ని ఒప్పేసుకున్నార‌ని చెప్పారు. తాను 23 మంది అధికారులు అంటే... బాల్క సుమ‌న్ ఇద్ద‌రు అధికారులే అని అంటున్నార‌ని - అధికారుల సంఖ్యలో తేడాలున్నా... తాను చేసిన ఆరోప‌ణ‌లు స‌రైన‌వేనని బాల్క సుమ‌న్ ఒప్పేసుకున్న‌ట్లే క‌దా అని రేవంత్ పేర్కొన్నారు. మొత్తానికి తాను చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వ‌ముంద‌ని, కేసీఆర్ స‌ర్కారు త‌ప్పు చేసింద‌ని సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎంపీనే ఒప్పుకున్నారు క‌దా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగానే మారిపోయాయి.
Tags:    

Similar News