అపారమైన స్వామి భక్తి చాలామంది రాజకీయ నేతల్లో కనిపిస్తూ ఉంటుంది. సాదాసీదాగా ఉన్న తమకు ఒక పదవి వచ్చేలా చేసిన అధినేత మీద అచంచలమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శించటం మామూలే. అయితే.. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాటలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా వర్సిటీలో ఉండే బాల్క సుమన్ ను ఎంపీ చేసింది.. ఎమ్మెల్యేను చేసింది కేసీఆరే అన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన విషయంలో అపారమైన భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తుంటారు.
అదేమీ తప్పు కూడా కాదు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన అధినేత విషయంలో ఆ మాత్రం కమిట్ మెంట్ ను ప్రదర్శించటం తప్పేమీ కాదు. కాకుంటే.. ఆ పేరుతొ నోటికి వచ్చినట్లు మాట్లాడితేనే తిప్పలన్ని కూడా. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన జాతీయ పొలిటికల్ పార్టీ మాట బయటకు వచ్చినంతనే బీజేపీ.. కాంగ్రెస్ లకు దడ మొదలైందని.. వెన్నులో వణుకు వచ్చేసినట్లుగా బాల్క సుమన్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు డ్యామేజింగ్ గా మారే పరిస్థితి.
టీఆర్ఎస్ బలం తెలంగాణలోనే ఇప్పుడు ఎంతన్న విషయం మీద బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. గులాబీ బాస్ పెట్టే జాతీయ పార్టీని బిల్డ్ చేసి.. కాంగ్రెస్.. బీజేపీలకు ప్రత్యామ్నాయంగా నిలవటం అంత తేలికైన విషయం కాదన్నది మరిచిపోకూడదు. ఆ విషయాల్ని వదిలేసి.. తమ అధినేత సన్నాహాక చర్యలతో రెండు జాతీయ పార్టీలకు చెమటలు పడుతున్నాయన్న మాటలు అతిగా మారతాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అదే సమయంలో తెలంగాణలోని రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు పిచ్చోళ్లు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారని.. వారిని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ కాదు.. ప్రాణం పోసే సంజీవని అన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి.
ఒకవైపు రేవంత్ ను పిచ్చోడిగా అభివర్ణించిన బాల్క.. మరి అదే రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేసి దానికి పంచ్ ఇచ్చేలా మాట్లాడటం ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇలాంటి పొంతన లేని మాటలు కేసీఆర్ ఇమేజ్ ను పెంచటం తర్వాత.. ఉన్నది కూడా పోయేలా చేస్తుందన్న విషయాన్ని బాల్క సుమన్ లాంటోళ్లు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.