ఎన్నారైకి 15 ఏళ్ల జైలుశిక్ష వేసిన అమెరికా కోర్టు

Update: 2017-03-09 04:42 GMT
ఓ దుర్మార్గ ఎన్నారైకి అమెరికా కోర్టు భారీ శిక్ష విధించింది. కన్నతల్లి లాంటి మాతృభూమిలో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులకు సాయం చేసిన నేరంపై 42 ఏళ్ల బల్వీందర్ సింగ్ ను గతంలో అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం.. అతడ్ని దోషిగా నిర్దారించింది. రెండు ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడైన బల్వీందర్ సింగ్ భారత్ లో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు సహకరించారు.

విచారణలో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో స్వతంత్ర సిక్కు రాజ్యాన్నిస్థాపించే లక్ష్యంతో ఖలిస్థాన్ ఉద్యమాన్ని చేప్టటారు. ఉద్యమంలో భాగంగా భారత్ లో దాడులు జరిపేందుకు బల్వీందర్ సింగ్ తో సహా మరికొందరు2013 చివర్లో దాడులు జరిపేందుకు కుట్రపన్నారు.

ఈ నేపథ్యంలో 2013 డిసెంబరులో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బ్యాంకాక్ కు వెళుతున్న బల్వీందర్ ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిపిన విచారణలో.. అతడు దాడులకు ప్లాన్ చేసిన విషయాన్నినిర్ధారించారు. దీంతో.. యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లానీ హిక్స్ 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే.. నేరం చేసినట్లుగా అభియోగం వచ్చిన తర్వాత.. కేవలం మూడేళ్ల కంటే తక్కువ వ్యవధిలో విచారణను పూర్తి చేయటమే కాదు..  శిక్ష ఖరారు చేయటం గమనార్హం. దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసేలా మన పార్లమెంటుపై దాడి చేసిన ముష్కరులకు శిక్షను ఖారారు చేయటానికి మనకి ఎంతసమయం పట్టిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే.. మన వ్యవస్థలు ఎంతగా మారాలన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News