'IPLను బ్యాన్ చేయండి'.. ఇదే ట్రెండింగ్

Update: 2022-11-10 15:30 GMT
15 ఏళ్ల సుధీర్ఘ కల.. అప్పుడెప్పుడో ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా కప్ కొట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు మన టీమిండియా అదే ఆశలతో ఆస్ట్రేలియా వెళ్లింది. గత ఏడాది యూఏఈలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో లీగ్ దశలోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో అందరూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కూడా  పోయింది.  అవమానకరరీతిలోనే అతడిని తొలగించి రోహిత్ ను కెప్టెన్సీ చేశారు.

అయితే కెప్టెన్ మారినా టీమిండియా కథ మారలేదు. భారత ఆటగాళ్లలో ఆ గెలవాలన్న కసి కనిపించలేదు. పాక్ పై అతికష్టం మీద గెలిచిన టీమిండియా సెమీస్ కు చేరామని సంతోషపడ్డ లోపే ఇంగ్లండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి దారుణ పరాభావాన్ని మిగిల్చింది. ఓపెనర్లే గెలిపించి భారత్ జట్టు పరువు తీశారు.

మన బౌలింగ్ వైఫల్యం దారుణంగా ఉంది. కనీసం ఫైట్ చేసి ఓడిపోతే కొంచెం గౌరవంగా ఉండేది. కానీ ఇలా దారుణంగా ఓడిపోవడాన్నే అభిమానులు జీర్నించుకోవడం లేదు.  అందుకే దీనంతటికి కారణం ఐపీఎల్ అని.. ఐపీఎల్ ను బ్యాన్ చేయాలంటూ నినదిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఘోర పరాజయం చవిచూడడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.  ఐపీఎల్ వల్లే కీలక ఆటగాళ్లు గాయాల పాలవుతున్నారని.. ఏకాగ్రత దెబ్బతింటోందని.. వాళ్లు దేశం కోసం ఆడట్లేదని.. డబ్బుల కోసం ఆడుతున్నారని ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే ఐపీఎల్ ను నిషేధించాలంటూ ‘#BoycottIPL’ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తమకు కావాల్సింది ఐసీసీ టోర్నమెంట్లు తప్ప ఐపీఎల్ కప్పులు కాదంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News