స్పా, పార్ల‌ర్‌ లో క్రాస్‌జెండ‌ర్‌ మసాజ్‌పై నిషేధం .. ఎక్కడంటే !

Update: 2021-11-16 23:30 GMT
అసోం రాష్ట్రంలోని గౌహ‌తి మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి స్పాలు, పార్ల‌ర్‌ ల‌లో క్రాస్ జెండ‌ర్‌ ( పురుషుల‌కు స్త్రీలు, స్త్రీల‌కు పురుషులు) మ‌సాజ్‌ ను నిషేదిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. యునిసెక్స్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలలో జరుగుతున్నదుష్ప్రవర్తనలను రూపుమాపేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు గౌహతి మున్సిపల్ కమిషనర్ దేవాశిష్ శర్మ తెలిపారు. ప్రజా నైతికత, పౌర సమాజాన్ని నియంత్రించే చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని ఈ సంద‌ర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. గౌహ‌తి న‌గ‌రంలో స్పాలు, సెలూన్లు పుట్ట‌గొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయ‌ని.. వీటిలో దాదాపు 60 శాతం రిజిస్ట‌ర్ చేయ‌కుండా చ‌ట్ట‌విరుద్దంగా నిర్వ‌హిస్తున్నార‌న్నారు.

ప‌ట్ట‌ణంలోని స్పాలు, బ్యూటీ పార్ల‌ర్లు, హెయిర్ క‌టింగ్ సెలూన్లకు నెల రోజుల స‌మ‌యం ఇచ్చామ‌ని నిబంధ‌న‌లు ఉల్ల‌గించిన వారి లైసెన్స్‌లు పున‌రుద్ద‌రించే అవ‌కాశం లేద‌ని చెప్పారు. ఇక కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. పార్ల‌ర్‌లు స్పాల‌కు ప్ర‌త్యేక గ‌దులు ఉండ‌కూడ‌దు. వీటి త‌లుపులు పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి. వ్య‌తిరేక లింగానికి చెందిన వారు మ‌సాజ్ సేవ‌లు చేయ‌కూడ‌దు. పౌర సమాజానికి హాని కలిగించే క్రాస్ జెండర్ మసాజ్, వ్యభిచారాన్ని నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం గౌహతిలోని పార్లర్‌లు, స్పాలకు ప్రత్యేక గదులు ఉండకూడదు.వీటి ప్రధాన ద్వారాలు పారదర్శకంగా ఉండాలి. వ్యతిరేక లింగానికి చెందిన సభ్యులు మసాజ్ సేవలను అందించకుండా నిషేధం విధించారు.

మసాజ్ చేసే వారు అర్హత కలిగి ఉండాలని జీఎంసీ ఉత్తర్వులో పేర్కొంది. ఆవిరి స్నానాలను అనుమతించినా క్రాస్ జెండర్లు మాత్రం సహాయం చేయలేరు.మసాజ్ పార్లర్లు, స్పాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేర క్రాస్ జెండర్ మసాజ్ పై నిషేధం విధించామని కమిషనర్ శర్మ చెప్పారు. గౌహతి లో దాదాపు 60శాతం బ్యూటీ పార్లర్లు, స్పాలు రిజిస్టరు చేయకుండా చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారని కమిషనర్ శర్మ చెప్పారు. కొత్త నిబంధనలకు అనుగుణంగా నగరంలో బ్యూటీ పార్లర్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు, స్పాలకు నెల రోజుల సమయం ఇచ్చామని, నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్‌ లు పునరుద్ధరించమని శర్మ చెప్పారు.
Tags:    

Similar News