'మాట్లాడే మాట.. చేసే చేత..' ఇవి రెండూ ఒక్కటవ్వడమే నిజాయితీ. అందరికీ వర్తించే ఈ విషయం.. రాజకీయ నాయకులకు మరింతగా సరిపోతుంది. నాయకుడు చెప్పే మాటకు.. చేసే చేతలకు పొంతన లేకపోతే ప్రజలు తేలిగ్గా గుర్తిస్తారు. ఫలానా నాయకుడిలో ఎంత నిజాయితీ ఉందో ఇట్టే పసిగడతారు. తాాజాగా.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గత అంశం తెరపైకి వచ్చింది.
రాజకీయం అభివృద్ధి మీద సాగే రోజులు ఏనాడో పోయాయి. ఇప్పుడు.. కేవలం ఎమోషన్ల మీద సాగుతోంది! అవును.. కొంతకాలంగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు.. చేస్తున్న చేతలు చూస్తే ఈ విషయం విస్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల భావోద్వేగాలను క్యాష్ చేసుకునేందుకు ఆ సమయంలో నాలుగు మాటలు మాట్లాడేసి.. మళ్లీ హాట్ టాపిక్ ఏదైతే అందులోకి వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది.
ఎన్నికల సమయంలో తాము ఏం చేసినా ఆ తరువాత ప్రజలు మరిచిపోతారని భావిస్తారో ఏమో తెలియదుగానీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో నాయకులు మాట్లాడిన మాటలు.. వారి చర్యలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఆ ఎన్నికలలో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డింది. ఇక బీజేపీ చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్ అక్రమ కట్టడాలే అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు. దీనికి కౌంటర్ గా మాట్లాడిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్ల జోలికి వస్తే 'నీ అంతు చూస్తాం' అనేశాడు. అంతే కాకుండా.. ఆ రెండు ఘాట్లకు వెళ్లి ఎన్టీఆర్, పీవీ నరసింహారావును పొగిడేసి, దండలు కూడా వేసేసి వచ్చారు. ఆ క్రమంలోనే ఎన్నికలు ముగిశాయి. బీజేపీకి కావలసిన ఫలితాలు వచ్చేశాయి.
సీన్ కట్ చేస్తే.. నిన్న (18వ తేదీ) ఎన్టీఆర్ 25వ వర్ధంతి. బహుశా ఎన్నికలు ముగిశాయి కదా.. ఎన్టీఆర్ తో మనకు పనేముంది? అనుకున్నారేమో గానీ.. బండి సంజయ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళనే లేదు. కనీసం మాట వరసకైనా ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేయలేదు. అదే రోజు వికారాబాద్ లో ఒక పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు సంజయ్. ఆ సభలో కూడా కనీసం ఎన్టీఆర్ ని ప్రస్తావించలేదు
జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఆయన ఘాట్ గురించి మాట్లాడిన ఆయన అంతు చూస్తానన్న సంజయ్.. అప్పుడు అవసరం లేకున్నా ఆయన ఘాట్ కు వెళ్లొచ్చిన సంజయ్.. ఆయన వర్ధంతి సందర్భంగా కనీసం ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది.
అంటే.. ఇదంతా కేవలం ఎన్నికల స్టంటేనా బండన్నా? అని ప్రశ్నిస్తున్నాడు సగటు నగర జీవి. కేవలం సెటిలర్ల ఓట్ల కోసం మాట్లాడిన మాటలే తప్ప, ఇందులో నిజాయితీ లేదని ఎత్తి చూపుతున్నారు. మాట్లాడే మాటలను.. చేసే చేతలను ప్రజలు క్షుణ్నంగా పరిశీలిస్తుంటారు బండన్న.. కాస్త సోచాయించు.