పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పండుగకు హాజరుకానున్నారా? తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఐక్యం చేసే అలయ్-బలయ్ కార్యక్రమం ఇందుకు వేడుకగా మారనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సౌమ్యుడిగా పేరున్న బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అలయ్ బలాయ్‌ను ఏటా దసరా పండుగ సందర్భంగా నిర్వహిస్తుంటారు. పదవిలో ఉన్నా లేకున్నా దత్తన్న నిర్వహించే ఈ సమ్మేళనానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరవుతుంటారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ తో దత్తన్న భేటీ అయ్యారు.
ఈ నెల 23న నిర్వహించే హైదరాబాద్‌లో నిర్వహించే అలయ్-బలాయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా దత్తాత్రేయ ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతిలో అలయ్ బలాయ్‌ది ప్రముఖ పాత్ర అని...రాజకీయ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నానని దత్తాత్రేయ చెప్పారు. దసరా పండుగ సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రముఖులను ఆహ్వానించి వారికి తెలంగాణ రుచులు, సంస్కృతి, సంప్రదాయాలు పరిచయం చేసే అలయ్- బలయ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న దత్తాత్రేయ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైతే ఆ వేడుక ప్రత్యేకతను సంతరించుకుంటుంది.