పవన్ కళ్యాణ్. టాలీవుడ్ టాప్ స్టార్. ఆయన 26 దాకా సినిమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. ఆయకంటూ ఒక స్టైల్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల పవన్ అభిమానులు అంటే పెద్ద ఎత్తునే ఉంటారు. అయితే వీరందరూ కాకుండా మరో పెద్ద అభిమాని కూడా పవన్ కి ఉన్నారని అంటున్నారు టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.
పవన్ అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ఆయన చెబుతున్నారు. అంటే పవన్ స్టార్ కి బాబు కూడా బిగ్ ఫ్యాన్ అనుకోవాలి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ జనసేనతో మళ్లీ టీడీపీ కలసి పోటీ చేస్తుంది అంటున్నారు బండారు వారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని కూడా ఆయన ముందే జోస్యం చెబుతున్నారు.
అంతే కాదు వైసీపీ సర్కార్ 2023 దాకా అధికారంలో ఉండదని, ముందే కుప్పకూలుతుందని కూడా జాతకం చెబుతున్నారు. మొత్తానికి బండారు వారి ఆశలు ఆశయాలు ఏంటి అన్నది కచ్చితంగా చెప్పేశారు. ఎక్కడా మనసులో దాచుకోకుండా అన్నీ పూసగుచ్చినట్లుగా వివరించేశారు. టీడీపీతో జనసేన పొత్తు కుదరాలి, వైసీపీని ఓడించాలి, తాము మళ్ళీ అధికారంలోకి రావాలి. అచ్చం బాబు మనసులో మాటనే తెలుగు తమ్ముడు జనాలకు వినిపించాడనుకోవాలి.