తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేయూలో పురుగుల మందు తాగి, ఇవాళ చనిపోయిన సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తున్న ఆయనను.. నర్సంపేట వద్ద పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని అన్నట్టు సమాచారం. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం మాట తప్పడం వల్లనే సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడని సంజయ్ ఆరోపించినట్టు సమాచారం. నిరుద్యోగ భృతికోసం కలెక్టరేట్లను ముట్టడిస్తే అరెస్టులు చేస్తున్నారని చెప్పినట్టు తెలుస్తోంది.
అంతేకాదు.. బీజేపీ హిందువుల పార్టీ అని కూడా బండి సంజయ్ అన్నట్టు తెలుస్తోంది. ప్రతీ ఇంటికి నీళ్లు, నిధులు, నియామకాలు విడుదల చేసింది కేంద్రమేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పాలనపై తమ పార్టీ పోరాడుతుందని అన్నారు. ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.
కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వట్లేదంటూ.. ఇటీవల సెల్పీ వీడియో తీస్తూ సునీల్ పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో వారం పాటు చికిత్స పొందిన అతను.. ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.