అమిత్ షా బూట్లు మోసిన బండి సంజయ్

Update: 2022-08-22 06:30 GMT
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో బండి సంజయ్ ఆయన బూట్లు మోయడం అందరినీ షాక్ కు చేసింది.  అమిత్ షా బూట్ల కోసం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హడావిడి చేస్తూ చేత్తో పట్టుకొని ఆయనకు అందించిన వీడియో   వైరల్‌గా మారింది. ఆదివారం నాటి తెలంగాణ పర్యటనలో అమిత్ షా స్థానిక ఆలయాన్ని సందర్శించగా అక్కడ అమిత్ షా బూట్లను చేత్తో తీసుకొని మరీ బండి అందించడం వీడియోకు చిక్కింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దేవాలయంలో ప్రార్థనలు ముగించుకుని అమిత్ షా, బండి సంజయ్ బయటకు వస్తున్నారు. ఇంతో బండి సంజయ్ షా కంటే ముందుగా వచ్చిన ఆయన బూట్లు ఇవ్వడానికి పరుగెత్తాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి దీన్ని పైనున్న బంగ్లా నుంచి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీన్ని సద్వినియోగం చేసుకున్న టీఆర్‌ఎస్ సోషల్ మీడియా మద్దతుదారులు రెచ్చిపోయారు. ఈ వీడియోను విస్తృతంగా ప్రచారం చేసి బండి సంజయ్ పై 'బానిస' ముద్రవేశారు. దీన్ని మంత్రి కేటీఆర్ సైతం ట్వీట్ చేసి హాట్ కామెంట్స్ చేశాడు.

''ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న  నాయకున్ని -  తెలంగాణ  రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ!'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై బండి సంజయ్ ఇంకా స్పందించలేదు. అతను ఖచ్చితంగా తన చర్యను సమర్థించుకుంటాడు. కానీ పార్టీ పట్ల లేదా బిజెపి అగ్రనాయకుల పట్ల తన విధేయతను ప్రదర్శించాల్సిన అవసరం అతనికి లేదన్నది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న.

ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారంటూ తెలంగాణ సమాజంలో ఇది వైరల్ గా వెళుతోంది. అసలే ఉద్యమాల గడ్డలో బండి సంజయ్ ఇలా బెండ్ కావడాన్ని సగటు తెలంగాణ వాది జీర్ణించుకోవడం లేదు.




Full ViewFull ViewFull ViewFull ViewFull ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News