మూడోసారి అధికారంలోకి రావటానికి కేసీయార్ తాంత్రికపూజలు నిర్వహిస్తున్నారా ? బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేసీయార్ పై చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. కేసీయార్ తన ఫాం హౌస్లో శతృనాశనం కోరి యాంత్రిక, తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారంటు ఆరోపించారు.
రోజుల తరబడి కేసీయార్ ఫాం హౌస్లో కూర్చుని చేసే పని ఇదేనన్నారు. చేతబడులు, తాంత్రిక పూజలు చేయించటం ద్వారా శతృవులపైకి క్షుద్రశక్తులను ఉసిగొల్పుతున్నారంటు మండిపడ్డారు.
బండి ఆరోపిస్తున్నట్లు కేసీయార్ యాంత్రిక, తాంత్రిక పూజలు చేస్తున్నారో లేదో ఎవరికీ తెలీదు. కేసీయార్ మీద చేసిన ఆరోపణలపై బండి దగ్గర ఆధారాలు ఏమున్నాయో కూడా ఎవరికీ తెలీదు. కానీ ఆరోపణలు మాత్రం బండి చేసేశారు. అలాగే రోజుల తరబడి కేసీయార్ ఫాం హౌస్లో ఉంటున్నది కూడా వాస్తవమే.
కేసీయార్ ఫాంహౌస్లో ఉంటున్నది ఇదే మొదటిసారి కాదు. చాలా కాలంగా కేసీయార్ ఇదే చేస్తున్నారు.
కేసీయార్ సచివాలయంలో కన్నా పాంహౌస్లోనే ఎక్కువుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. తాను హిందువనని చెప్పుకునే కేసీయార్ బోగస్ హిందువంటు బండి మండిపడ్డారు. సీఎం ఎన్ని తాంత్రికపూజలు చేసినా రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించటం కేసీయార్ తరం కాదన్నారు. హిందువుల ఓట్ల కోసమే కేసీయార్ హిందువునని, హోమాలు చేస్తు డ్రామాలాడుతున్నట్లు మండిపడ్డారు.
గతంలో అధికారంలోనే కంటిన్యు అయ్యేందుకు ఇలాంటి క్షుద్రపూజలే చేయించిన ఒక ముఖ్యమంత్రికి తర్వాత ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఎదురయ్యిందో గమనించాలని కేసీయార్ కు బండి వార్నింగ్ ఇచ్చారు.
అంతా బాగానే ఉందికానీ అసలీ యాంత్రిక, తాంత్రిక పూజలేంటో, ఫాంహౌస్ ఏమిటో, క్షుద్రపూజలు, చేతబడులు ఏమిటో మామూలు జనాలకు అర్ధం కావటంలేదు. ఎంత ఫాంహౌస్లో కేసీయార్ కూర్చుంటాడని తెలిసినా మరీ తాంత్రికపూజలు చేయిస్తున్నట్లు ఆరోపించటం ఎబ్బెట్టుగా ఉంది. ఆరోపణలు కాకుండా బండి తగిన ఆధారాలు చూపిస్తేనే జనాలు నమ్ముతారు కానీ ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే ఎలాగ ?