బండి ది గ్రేట్.. నేను మతతత్వ వాదినే.. కుండ బద్ధలు కొట్టేశాడు

Update: 2021-03-06 07:30 GMT
మొహమాటాలు లేవు. ఎవరు ఏం అనుకుంటారన్న శంక లేదు. నేను చేసేదే చెబుతా. నా వరకు నేనే నిజాయితీగా ఉంటా. మీరేం అనుకున్నా సరే.. నా గురించి నేనే క్లియర్ గా చెబుతా. ఓట్ బ్యాంకు రాజకీయాలు వద్దు.. సింఫుల్ గా సూటిగా విషయాన్ని చెప్పేస్తా అన్న రీతిలో.. ఇప్పటివరకు ఏ రాజకీయ నేత చెప్పలేని విషయాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుండ బద్ధలు కొట్టేశాడు. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

80 శాతం హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే తాము చేసేదేమీ లేదని.. ఒక వర్గానికి కొమ్ము కాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దన్న ఆయన.. బీజేపీ మతతత్వ పార్టీనే అని.. తాను మతతత్వ వాదినే అని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడగని కేసీఆర్ కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. మంత్రులు.. ఎమ్మెల్సీలు ఎప్పుడు పార్టీని వదిలేస్తారో తెలీదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకురాజకీయ పార్టీలు.. నేతలు తమను తాము సెక్యులర్ వాదులుగా చూపించుకునేందుకు తెగ తాపత్రయ పడేటోళ్లు. అందుకు భిన్నంగా బండి సంజయ్ మాత్రం.. ఓపెన్ గా తమ రాజకీయ ప్రత్యర్థులు తమపై ఏ తరహా విమర్శలు.. ఆరోపణలు చేస్తారో.. వాటిని ఒప్పేసుకొని.. మీరు అంటారా? అనండి.. మీరు అన్నట్లు నేను మతతత్వ వాదినే.. మా పార్టీ మతతత్వ పార్టీనే అంటూ తేల్చేసినట్లుగా చెప్పిన తర్వాత విపక్షాలు మాత్రం ఏం చేస్తాయి? మొత్తంగా రోటీన్ కు భిన్నమైన రివర్సుగేర్ రాజకీయాల్ని బండి అమలు చేస్తున్నట్లుగా అనిపించట్లేదు?
Tags:    

Similar News