తెలంగాణలో రెండు రోజుల కిందట జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను కూడా టీఆర్ ఎస్ అభ్య ర్థులు గెలుచుకున్నారు.. వీరిలో ఒకరు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె.. సురభి వాణి ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు బీజేపీ నేతల సంచలన కామెంట్లు మరింత వేడి పుట్టిస్తున్నా యి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్టుగా బీజేపీ, టీఆర్ ఎస్ అభ్యర్థుల మధ్య పోరు సాగింది. చివ రి వరకుకూడా ఉత్కంఠగా మారిన ఈ పోరులో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీనే ఇచ్చారు. ఇక, ఇప్పుడు రా ష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. సంచలన వ్యాఖ్యలు చేశారు..
‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో దివంగత ప్రధాని పీవీ గెలిచిన ట్లా? కేసీఆర్ గెలిచినట్లా?’ స్పష్టం చేయాలని బండి డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాం శంగా మారింది. కేసీఆర్ ముఖం చెల్లకనే పీవీ ఫొటోతో ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. బీజేపీ భయం తో కాళరాత్రులు గడిపిన కేసీఆర్.... ప్రతీ నిమిషం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్ ఎస్ అభ్యర్థుల గెలుపు అనంతరం కేసీఆర్ నవ్వు వెనుక రాక్షసానందం ఉందని ఎద్దేవా చేశారు. 2023 ఎన్ని కల్లో టీఆర్ ఎస్‌ను ఓడించి, గడీల పాలనను బద్ధలు కొట్టడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
ఈ ఎపిసోడ్‌లో బండి చేసిన కామెంట్లలో కీలక అంశం ఉందనేది వాస్తవం. పీవీ ఫొటోతోనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు. మరి ఇది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? బండి చేసిన డిమాండ్‌లోనూ వాస్తవం ఉంది. అయితే.. గెలుపు మాత్రమే ముఖ్యమని అనుకుంటే.. దీనికి టీఆర్ ఎస్ నుంచి సమాధానం వచ్చే అవకాశం లేదు. కానీ, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఒక గుంభనమైన పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే విమర్శలు వస్తున్న సమయంలో కేసీఆర్ సహా పార్టీ నేతలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక, అదేసమయంలో బండి మరో కీలక కామెంట్ చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు మిగతా రాజకీయ పక్షా లు పని చేశాయని ఆరోపించారు. ఇది నిజమేనా? అనేదిఆలోచించాలి.. ఇదే కనుక నిజమైతే... తెలంగాణ రాజకీయాలను చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన మంత్రి కేటీఆర్.. అజాంజాహి మిల్లు, నిజాం షుగర్స్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని బండి నిలదీశారు. మొత్తంగా చూస్తే.. బీజేపీ చీఫ్ బండి డిమాండ్లు, సవాళ్లకు రాజకీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కానీ, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.