బైరి నరేష్ తో బండి సంజయ్ భేటి అయ్యారా? అసలు నిజం ఇదీ

Update: 2023-01-04 10:45 GMT
దళిత నేత భైరి నరేష్ ఇటీవల అయ్యప్ప స్వామిపై, అయ్యప్ప భక్తులపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అయ్య ప్ప స్వాములు ఆందోళనలతో అట్టుడికించారు. నరేష్ పై.. ఆయన మద్దతు తెలిపిన సోదరుడు భైరి అగ్నితేజ్ పై దాడులకు పాల్పడ్డారు. ఉద్రిక్తతలకు దారితీయడంతో నరేష్, అగ్నితేజ్ లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అయితే భైరి నరేష్ అరెస్ట్ తర్వాత  ఓ వెబ్ సైట్ లో రాసిన కథనం తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన ‘భారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు భైరి నరేష్’తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటి అయ్యారని.. ఈ భేటి తర్వాతనే హిందూ దేవుళ్లపై  నరేష్ ఈ వ్యాఖ్యలు చేశారని టాక్ నడిచింది.

జైశ్రీరామ్ అంటూ హిందుత్వ భావజాలంతో వెళ్లే బీజేపీ నేత బండి సంజయ్ ఇలా భైరి నరేష్ తో ఎందుకు భేటి అయ్యాడు. ? బండినే రెచ్చగొట్టాడా? అన్న ప్రచారం సోషల్ మీడియాలో వెబ్ సైట్లలో జరిగింది. ఈ వార్త వైరల్ కావడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. బండి సంజయ్ చేసిన చర్యపై బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో ట్విటర్ వేదికగా బీజేపీ స్పందించింది.. క్లారిటీ ఇచ్చింది. సదురు వెబ్ సైట్ లో వచ్చిన ఆ వార్తను స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ లో పోస్ట్ చేసి ఇది ఫేక్ న్యూస్ అని బండి సంజయ్ ఎప్పుడూ భైరి నరేష్ తో భేటి కాలేదని.. ఇది పూర్తిగా అవాస్తమని ఖండించింది. ఇలాంటి తప్పుడు వార్తలతో బండి సంజయ్ , బీజేపీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ బీజేపీ హెచ్చరించారు.

అయితే బీజేపీ క్లారిటీ ఇచ్చినా కూడా బండి సంజయ్ ఈ విషయంపై చెప్పాలని.. టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారని.. యాదగిరి గుట్ట వెళ్లి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో బండి మాట్లాడకుండా బీజేపీ తరుఫున ప్రకటన చేయడమే అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనిపై బండి సంజయ్ నేరుగా స్పందిస్తే ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News