కేసీఆర్ సీటు కోసం.. కేటీఆర్‌-క‌విత‌-అల్లుడు జుట్లు ప‌ట్టుకుంటున్నారు: బండి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-06-27 04:01 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవించి ఉండ‌గానే ఆయ‌న సీఎం సీటుకోసం.. కుటుంబ స‌భ్యులు కొట్టుకుంటున్నార‌ని.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. ఫైర్ బ్రాండ్‌, ఎంపీ.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

''సీఎం కేసీఆర్ ఆ సీటును త‌న‌కు ఇస్త‌డో లేడో అని కొడుకు కేటీఆర్ దిగులు పెట్టుకున్న‌డు. ఇక‌, కూతురు క‌విత‌, అల్లుడు కూడా కేసీఆర్ ఎప్పుడు దిగుత‌డా.. తాము ఎప్పుడు ఎక్కుత‌మా.. అని ఎదురు చూస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వీరి మ‌ధ్య సీఎం సీటు కోసం.. పంచాయితీలు కూడా న‌డుస్తున్నాయని చెప్పడం గ‌మ‌నార్హం.

ఇక‌, తెలంగాణలో కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని, కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ ఎస్‌కు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని  బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి.. కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీఆర్ ఎస్‌ నేత సామ వెంకట్‌రెడ్డితో పాటు ఆయన వర్గీయులు.. మాజీ కార్పొరేటర్, టీఆర్ ఎస్‌ నేత నవతా రెడ్డి, కృష్ణా నాయక్‌ తదితరులు సంజయ్ సమక్షంలో పార్టీలో చేరగా.. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ పార్టీని, పార్టీ సిద్ధాంతాన్ని, ప్రధాని మోడీని నమ్మి బీజేపీలో చేరిన వారందరికీ స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ వైఖరితో చాలా మంది టీఆర్ ఎస్‌ నేతలు  బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్‌ అనుకుంటుంటే.. కూతురు, అల్లుడు సైతం సీఎం పదవి కావాలనుకుంటున్నారని అన్నారు.
Tags:    

Similar News