చంద్రబాబుతో కలిసినందుకేనా.. బండ్ల వివరణ

Update: 2018-12-20 06:30 GMT
టీఆర్ ఎస్ వాళ్లు చెప్పిందే నిజమైందని.. చంద్రబాబు వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న వ్యాఖ్యలు నిజం కావని.. వాటిని తాను విశ్వసించనని నటుడు -  టీఆర్ ఎస్ ను జనం నమ్మారని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. తాను పారిపోయానని.. దొంగ దొరికాడని మీడియాలో రావడాన్ని చూసి తట్టుకోలేకే తాను మీడియా ముందుకు వచ్చానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

లోక్ సభ ఎన్నికల్లో ఇంకా ఉత్సాహంగా ముందుకువెళతామని.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించేందుకు చురుగ్గా ప్రయత్నం చేస్తామని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఓడిపోగానే మూసుకొని కూర్చోమని.. ఎమ్మెల్సీ లాంటి పదవులు తమకు రావని.. పదవుల కోసం కాదని.. ప్రజలకు సేవ చేయడానికే కాంగ్రెస్ తరుఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే తాము ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని.. దాన్ని తట్టుకొని తాము ముందు నిలబడాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. రామారావు - కేసీఆర్ - ఇందిరగాంధీ ఓడిపోయారని.. జానారెడ్డి - డీకే అరుణ  - రేవంత్ లాంటి వాళ్లు ఓడిపోవడంలో పెద్ద వింతేమి లేదన్నారు.

సోషల్ మీడియాలో తన ఇంటి వద్ద బ్లేడులు పట్టుకొని తిరగాన్ని చూసి నా భార్య - పిల్లలు బాధపడ్డారని బండ్ల చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ గొంతుకోసుకున్నాడని.. రక్తం కారినట్టు.. ఆస్పత్రి పాలైనట్టు చూపించారని.. ఒకరిని చంపి ఆ శవం మీద డబ్బులు ఏరుకునే స్థాయికి మీడియా దిగజారిందని బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని.. ఆయన వద్దకు గొడ్డలి పట్టుకొని వెళ్లే దమ్ముందా అని మీడియాను బండ్ల నిలదీశారు.

 గెలిచిన టీఆర్ ఎస్ నాయకులు తనను ఒక్క మాట కూడా అనలేదని.. అసలు నన్ను పట్టించుకోలేదని వారిది మంచి మనసు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తిరుపతిలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి - జే వివేకనందా వాళ్లు మీడియా మాటలను పట్టించుకోవద్దని జబ్బ చరిచారని..రాజకీయాల్లో ఇవి సహజమని.. నువ్వు ఇలానే ఉత్సాహంగా మాట్లాడాలని ఎంకరేజ్ చేశారని బండ్లగణేష్ వివరించారు. కానీ అటూ ఇటూ కానీ ఈ మీడియా వాళ్లు మాత్రం తనను వదలడం లేదని బండ్ల ఫైర్ అయ్యారు.  మీడియా - సోషల్ మీడియాలో మాత్రమే తనను టార్గెట్ చేసి వేధించారని వివరించారు.
Tags:    

Similar News