బండ్ల గణేష్..ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు.. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. రాజకీయాలకే సంబంధం లేదంటాడు చివరకు రాజకీయ నేతలతో అంటకాగుతాడు. పవన్ కళ్యాణ్ ను ఇప్పటికే దేవుడు అన్న బండ్ల గణేష్ ఇప్పుడు మరో దేవుడిని తయారు చేశాడు. ఆయన ఎవరో కాదు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర కాంగ్రెస్ లో చేరిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.. కాంగ్రెస్ కూడా బండ్ల గణేష్ కు ప్రాధాన్యతనిచ్చి ఏకంగా అధికారప్రతినిధిని చేసేసింది. దీంతో మీడియా మైకుల ముందు చెలరేగిపోయిన బండ్ల గణేష్ నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే 7ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని శపథం చేశారు.
అయితే బ్యాడ్ లక్.. నాడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బండ్ల గణేష్ కల నెరవేరలేదు. ఇక టీఆర్ఎస్ యాంటీగా చాలా మాటలు అన్న బండ్ల గణేష్ కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక మనస్థాపం చెందిన మొత్తం రాజకీయాలనే వదిలేశాడు.. రాజకీయాలకు తనకు సంబంధం లేదంటూ అస్త్రసన్యాసం చేశాడు.
తాజాగా బండ్ల గణేష్ బీజేపీ ఎంపీ రంజిత్ రెడ్డిని కలిసి ఆయన కాళ్లు మొక్కడం సంచలనమైంది. బీఆర్ఎస్ లో తాను లేనని అన్నారు. కానీ రంజిత్ వెంట ఉన్నానని ప్రకటించడం సంచలనమైంది. రంజిత్ రెడ్డినే లేకుంటే తాను ఆత్మహత్య చేసుకునేవాడినని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కాల్లపై పడ్డ బండ్లను లేపి మరీ రంజిత్ భుజం తట్టారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘రంజిత్ అన్న తనకు దైవంతో సమానమన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కూడా బండ్ల గణేష్ ఇదే రీతిలో ప్రశంసించాడు. బండ్ల గణేష్ ఇప్పటికే పవన్ ను దేవుడిగా కొలుస్తాడు. ఇప్పుడు ఆయనకు మరో ఎంపీ రంజిత్ రెడ్డి కూడా దైవంగా భావించడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.