బండ్ల గణేష్. సినీ క్యారెక్టర్ నటుడు, నిర్మాత. అంతేకాదు.. సంచలన వ్యాఖ్యలతో మీడియాలోనూ తరచుగా సెగ పుట్టిస్తుంటాడు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆతర్వాత నిర్మాతగా మారి హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు హీరోగా 'డేగల బాబ్జీ`గా నటించాడు. ప్రభుత్వాలను మచ్చిక చేసుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడనే పేరుంది. ఏపీలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు బినామీ అని.. ఆయన బంధువేనని కొన్నాళ్లపాటు టాలీవుడ్‌లో పెద్దటాకే నడిచింది.
ఆ మధ్య కొంతకాలం సినిమాలకు దూరమైన బండ్ల గణేష్ రాజకీయాల్లో రాణించాలని చూసాడు. కానీ అది కుదరలేదు.. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నారు. గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని కొన్నాళ్ల కిందట ప్రకటించారు. ఈ క్రమంలోనే బండ్ల గణేశ్ మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామివారిని కలిశారు. స్వామి తన జీవితచరిత్రను సినిమాగా తీయాలని ఆదేశించారని బండ్ల గణేష్ తెలిపాడు. అయితే.. ఇది కూడా పట్టాలకెక్కలేదు.
ఇక, ఇటీవల సెగలు పుట్టించినమా అసోసియేషన్ ఎన్నికల్లోనూ బండ్ల తనదైన ట్విస్ట్ ఇచ్చి.. అందరినీ విస్మయానికి గురిచేశాడు. ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న బండ్ల గణేష్.. చివరి నిమిషంలో తన మార్క్ ట్వీట్ వేశాడు. వివిధ పరిణామాల అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు ఫైనల్‌గా ప్రకటించిన బండ్ల గణేష్ చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మంచు విష్ణు ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రఘు బాబుకు ఓటు వేయాలని కోరాడు.
ఇదిలావుంటే.. ఇప్పుడు ప్రబుత్వాలకు అనుకూలంగా తనదైన శైలిలో సేఫ్ గేమ్ ఆడాడనే కామెంట్లు గణేష్ విషయంలో వినిపిస్తుండడం గమనార్హం. నాకు తెలిసి.. నాకు ఇష్టమైన తెలుగు జాతి రత్నాలు అంటూ.. ఎనిమిది మంది ప్రముఖుల ఫొటోలను షేర్ చేశాడు. వీరిలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్,వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ఉన్నారు. వీరితోపాటు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోను కూడా తన ట్విట్టర్‌లో షేర్ చేయడం గమనార్హం.
అదేసమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఈనాడు అధిపతి రామోజీరావు, మెగాస్టార్ చిరంజీవి వంటివారుతనకు ఇష్టమైన జాతిరత్నాలుగా బండ్ల పేర్కొనడం గమనార్హం. ఈ వ్యవహారం గమనిస్తే.. ఆయా రంగాల్లో బండ్ల పేర్కొన్నవారు.. ప్రముఖులే కాకుండా.. అందరూ ముక్తకంఠంతో(కొందరు తప్పదనైనా సరే!) ఇష్టపడే వారే కావడం గమనార్హం. మొత్తానికి బండ్ల వ్యూహాత్మకంగా వ్యవహరించాడని అంటున్నారు.