టాలీవుడ్ నటుడు - నిర్మాత బండ్ల గణేశ్ షాద్ నగర్ నుంచి పోటీ చేయనున్నారన్న వార్త హైదరాబాద్ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. రాహుల్ గాంధీ సమక్షంలో దిల్లీలో శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు మరికొందరు కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. గణేశ్ చేరికతో షాద్ నగర్ లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, ఆయన సినీ గ్లామర్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
కాగా ఇప్పటికే టీఆరెస్ 105 మందితో అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన సంగతి. ఆ జాబితాలో షాద్ నగర్ కూడా ఉంది. సిటింగ్ ఎమ్మెల్యే ఎల్గానమోని అంజయ్య యాదవ్ కు టీఆరెస్ ఇక్కడ మళ్లీ టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో అంజయ్య కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్ రెడ్డిపై 17 వేల ఓట్లతో గెలిచారు.
ఈసారి టీఆరెస్ పాత అభ్యర్థికే టికెటివ్వగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని మార్చే ఉద్దేశంలో ఉణ్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే బండ్ల గణేశ్ ను పార్టీలోకి తీసుకుని షాద్ నగర్ టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట.
నాలుగు మండలాలున్న షాద్ నగర్ నియోజకవర్గంలో గణేశ్ కు రాజకీయంగా ఏమీ పట్టులేనప్పటికీ కొత్తూరు మండంలోని కొన్ని గ్రామాల్లో ఆయనకు భూములున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పలువురు స్థానిక నేతలతో గణేశ్ కు పరిచయాలున్నాయని.. పైగా డబ్బు పెట్టగలిగే సామర్థ్యం... సినీ గ్లామర్‌ను ఎన్నికల్లో ఉపయోగించే నేర్పు ఉండడంతో ఆయన్ను అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది.