కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ సమయంలో కొందరు కొన్ని కొన్ని పుకార్లు నమ్మి మరింతగా భయాందోళనకు గురి అవుతున్నారు. ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభించక ముందు నుండి కూడా చికెన్ తినడం వల్ల కరోనా వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. కరోనా సోకకుండా ఉండాలంటే చికెన్ తినకుండా ఉండాలంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఒక్కసారిగా పౌల్ట్రీ ఫామ్ పరిశ్రమ కుదేలయ్యింది. కోట్లాది రూపాయల నష్టాలు రైతులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమయంలో కనీసం గుడ్లను కూడా తినేందుకు జనాలు భయపడుతున్నారు. ప్రభుత్వాలు ఒక వైపు కరోనాకు చికెన్ కు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేసినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు. ఈ సమయంలో కొన్ని రోజుల క్రితం కేటీఆర్ హైదరాబాద్ లో చికెన్ మేళ నిర్వహించి అందులో పాల్గొని చికెన్ తిన్నాడు. నిన్న ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ చికెన్ తినడం వల్ల కరోనా రాదంటూ ప్రకటించాడు.
ఈ సమయంలో రోగ నిరోదక శక్తి చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరు కూడా చికెన్ గుడ్లు ఇంకా రోగ నిరోదక శక్తిని పెంచే మాసం చేపలను తినాలంటూ సూచించాడు. ఆ వీడియోను నిర్మాత ఇంకా పౌల్ట్రీ ఫామ్స్ అధినేత బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు మీ సహాయానికి పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ తరపున కృతజ్ఞతలు అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పౌల్ట్రీ ఫామ్స్ చాలా నష్టాల్లో ఉన్నాయి. కేసీఆర్ మాటలతో కొద్దిలో కొద్దిగా అయినా మార్పు వచ్చే అవకాశం ఉందని.. జనాలు చికెన్ వైపు ఆసక్తి చూపించే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.