వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన.. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
‘మీకు కులం నచ్చకుంటే.. కమ్మవాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి.. కానీ చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి’ అని బండ్ల గణేష్ ట్వీట్లతో మొదలుపెట్టాడు. అనంతరం వరుసగా ట్వీట్లు చేస్తూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టాడు.‘అధికారం శాశ్వతం కాదు.. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు’ బండ్ల సూటిగా విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేసి హెచ్చరించాడు.
‘ప్రతి కమ్మవారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే. కానీ టీడీపీ కాదు.. సాయిరెడ్డిగారు’ అంటూ ట్వీట్ తో బండ్ల గణేష్ కౌంటర్లు ఇచ్చాడు.
-బండ్ల గణేష్ ట్వీట్లను ఒకసారి పరిశీలిస్తే...
*‘ అయ్యా ఆంధ్ర కి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి నీ కుల పిచ్చకి నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది’
‘‘నాకు వైఎస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. నువ్వు పెద్ద దరిద్రానివి మా కులాన్ని ఎందుకు అన్నీ విషయాల్లో కి లాగుతున్నవ్
కెసిఆర్ ను చూసి నేర్చుకో అన్ని కులాల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు’’’
‘‘చంద్రబాబు తో ఉంటే ఆయనతో తేల్చుకో. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కో. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు’’
‘‘నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు కానీ కులాన్ని కాదు...నిన్ను జైల్ కు పంపింది... కమ్మ వారు కాదు... త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి... ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు. అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా’’
‘‘కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రకి నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు’’
‘‘....కమ్మ వారిని తిట్టాడా న్ని తట్టుకోలేక పోతున్న నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు ...దయచేసి కులాన్ని తిట్టకు... ఇదేనా నీ సంస్కారం ? నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు...ఎంపీ గా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెట్టికెక్కి ప్రవర్తిస్తున్నవు ’’
‘‘జగన్ గారు ...ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు. నాకు కుల పిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తాను. ప్రతి కులాన్ని గౌరవిస్తాను’’
‘‘పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం.. పచ్చని కాపురం లో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు అది నీకు మంచిది కాదు...టిడిపి కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారిని టికెట్ ఇచ్చారు’’
‘‘కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేము విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నవు ...ఇది ప్రపంచానికి తెలుసు’’
‘అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం’’
‘‘వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి’’
ఇలా విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేసి మరీ తనలోని ఆవేశాన్ని.. ఆక్రోశాన్ని బండ్ల గణేష్ ట్వీట్ల రూపంలో కక్కేశారు. విజయసాయిరెడ్డి చేసిన పోస్టుల్లో తన కులం గురించి.. ఇతర అంశాల గురించి అనడంతో దానికి బండ్ల గణేష్ ఒక్కో ట్వీట్ తో ఎదురుదాడి చేశాడు. బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.