ఆ వింత శబ్దాలకు బెంగళూరు నగరం మరోసారి భయపడింది

Update: 2021-11-27 04:12 GMT
కారణం చెప్పరు. అసలేం జరిగిందో అర్థం కాదు. ఎందుకిలా అవుతుందన్నది ఆలోచించే కొద్దీ ఆందోళన తప్పించి.. మరింకేమీ లేని వైనం బెంగళూరు వాసులకు ఈ మధ్యన ఎదురవుతోంది. గత ఏడాది మేలో అప్పటివరకు మామూలుగా ఉన్న బెంగళూరు మహానగరంలో ఒక్కసారిగా వింత శబ్దాలు చోటు చేసుకున్నాయి. ఈ శబ్దాల తీవ్రతకు ఇంటి తలుపు రెక్కలు సైతం కొట్టుకునే పరిస్థితి. ఇంతలా వణికించే సీన్ ఎందుకు చోటు చేసుకుంటున్నట్లు? దాని వెనకున్న శాస్త్రీయ కారణం ఏమిటి? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

కర్నాటక రాష్ట్ర రాజధాని.. గార్డెన్ సిటీగా పేరున్న బెంగళూరు మహానగరంలో అప్పుడప్పుడు వింత శబ్దాలు చోటు చేసుకోవటం.. దీనికి కారణం ఏమిటన్నది తేలకపోవటం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బెంగళూరు.. మండ్య.. రమణనగర ప్రాంతాల్లో వచ్చిన వింత శబ్దాలకు నగర వాసులు భయాందోళనలకు గురయ్యారు.

తొలుత పలువురు భూకంపంగా భావించారు. తర్వాత సూపర్ సోనిక్ బూమ్ కు సంకేతాలా? అన్న సందేహానికి గురయ్యారు.

కానీ.. ఇవేమీ కాదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ శబ్దాలకు కారణం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ భారీ శబ్దాల కారణంగా ఇంటి తలుపులు.. కిటికీలు ఊగిన పరిస్థితి. ఈ వింత సౌండ్లను సెసిమిక్ అబ్జర్వేటరీలతో విశ్లేషిస్తే.. భూకంప సంకేతాలు ఏమీ కనిపించలేదని చెబుతున్నారు. ఈ వివరం కాస్తంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికి పూర్తి టెన్షన్ ను మాత్రం తీర్చలేదని చెప్పాలి.

అయితే.. ఈ శబ్దాలు యుద్ధ విమానం పరీక్షించినప్పుడు వచ్చిన శబ్దాలేనని.. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చెబుతోంది. అయితే.. ఈ శబ్దాలకు ప్రత్యేకకారణం లేదని హెచ్ ఏఎల్ చెబుతున్నా.. సామాన్యుడు మాత్రం సమాధానం పడటం లేదు. ఎందుకిలా జరుగుతుందన్న సందేహాన్ని తీర్చుకునేందుకు సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్ని ఆశ్రయిస్తున్నాడు. అధికారులు సైతం సమాధానం చెప్పే విషయంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News