కొన్నిసార్లు అంతే.. అప్పటివరకూ ఎలాంటి పేరుప్రఖ్యాతులు ఉండవు. కానీ.. ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. సంచలనంగా మారుతుంటారు. అలాంటి రాజకీయ సంచలనంగా బంగారు ఉషారాణిని చెప్పాలి. ఇప్పటికిప్పుడు ఉషారాణి పేరును చెప్పినంతనే ఆమె గుర్తుకు రారు.
కానీ.. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన బంగారు ఉషారాణి అన్నంతనే ఆమె చప్పున గుర్తుకు వస్తారు. 2009 ఎన్నికల్లో సంచలన విజయాలుగా ఉషారాణి ఎమ్మెల్యే కావటంగా చెప్పాలి. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె అనూహ్యంగా చిరుపైన గెలవటంతో ఆమె పేరు నాటి ఉమ్మడి రాష్ట్రంలో మారుమోగింది.
ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె అంతటి సంచలన విజయాన్ని ఎలా సాధించారన్న ఆసక్తి చాలామందిలో వ్యక్తమైంది. జెయింట్ కిల్లర్ గా పేరు సాధించిన ఆమె అప్పట్లో అసెంబ్లీకి వస్తుంటే చాలా ఆసక్తిగా గమనించేవారు.
ఇదంతా గతం. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? అన్న ప్రశ్నలు వేసుకుంటే ఆసక్తికర సమాధానాలు వస్తాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిరంజీవి మీద పోటీ పడిన ఉషారాణి సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి తన సభ్యత్వాన్ని రాజీనామా చేశారని చెబుతారు.
గడిచిన రెండేళ్లుగా కాంగ్రెస్ కు దూరంగా ఉన్న ఆమె.. పార్టీ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనలేదు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్నకు ఉషారాణి స్పందిస్తూ.. తాను ఇప్పటికి కాంగ్రెస్ లోనే ఉన్నట్లు చెప్పారు. మరి.. ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం సూటిగా రావటం లేదు. తన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెబుతున్న ఆమె.. తానింకా కాంగ్రెస్ లోనే ఉన్నట్లు చెబుతుండటం గమనార్హం.