బంగ్లాదేశ్ ప్రయోగం సక్సెస్: మహమ్మారి నివారణకు యాంటీ పారాసైట్ డ్రగ్
మహమ్మారి వైరస్ నివారణ కోసం పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వైద్య శాస్త్రాల్లో ఆ వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు విస్తృతంగా ప్రయోగాలు, పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కొత్త విరుగుడు కనిపెట్టింది. కనిపెట్టిన మందుతో వైరస్ బాధితులు కోలుకోవడంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో ఆ డ్రగ్ అద్భుతమైన ఫలితాలు ఇస్తోందని ఆ దేశం ప్రకటించింది. ఇంతకీ ఆ మందు ఏమిటంటే టీ- పారాసైట్ డ్రగ్. ప్రతిరక్షకాల కాంబినేషన్‌తో ఆ మహమ్మారిని కట్టడి చేయవచ్చని ఆ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు.
వైరస్ సోకిన వారికి డజన్ల సంఖ్యలో యాంటీ పారాసైట్ డ్రగ్, యాంటిబయోటిక్‌లు ఇవ్వడంతో నాలుగు రోజుల్లోనే కోలుకున్నారని బంగ్లాదేశ్ మెడికల్ హాస్పిటల్ వైద్య విభాగం అధిపతి డాక్టర్ మహ్మద్ తారిక్ ఆలం ప్రకటించారు. తలపేన్లు, గజ్జి, దురద నుంచి విముక్తి పొందేందుకు వాడే డీ- వార్మింగ్ (పురుగులను నిర్మూలించే ప్రక్రియ) చికిత్స విధానం అమలుచేసినట్లు వివరించారు. దీంతో నమ్మకం శక్యం కాని ఫలితాలు పొందామని తెలిపారు. 60 మంది బాధితులకు ఈ మందు అందించగా.. వారంతా కోలుకున్నారని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ఈ విధంగా ఈ డ్రగ్ కనుగొనగా మరికొన్ని దేశాలు ఇంకా పరిశోధనలు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, భారత్, చైనా, ఇటలీ సహా పలు దేశాల పరిశోధకులు ఆ మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇంతకుముందు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ సిద్ధమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో తొలి విడత వ్యాక్సిన్ సరఫరాను చేపడతామని బయోఫార్మా సంస్థ ఆస్ర్టాజెనెకా ప్రకటించింది. ఏది ఏమున్నా మరికొన్నాళ్లు ఆ వైరస్‌కు విరుగుడు మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.