బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు మరోసారి తమ స్థాయిని చాటుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాతో మ్యాచ్ నేపథ్యంలో వాళ్ల అత్యుత్సాహం.. వాళ్ల క్రియేటివిటీ చూస్తే ఎవ్వరికైనా ఒళ్లు మండక మానదు. ఒక పులి కుక్కను వేటాడుతున్న ఫొటో పెట్టి.. పులికి బంగ్లాదేశ్ జెండా రంగు పులిమి.. కుక్కకు ఇండియా రంగు అద్దారు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో జరగబోయేది ఇదే అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు. ఇది భారతీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
గత కొన్నేళ్లలో బంగ్లాదేశ్ జట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ తమ స్థాయిని పెంచుకుంటోంది కానీ.. ఆ దేశ అభిమానులు మాత్రం అత్యుత్సాహంతో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇంతకుముందు ఇండియా బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయినపుడు.. ఆ సిరీస్ లో రాణించిన యువ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్.. మన ఆటగాళ్లకు అరగుండ్లు కొట్టినట్లుగా ఫొటోలు తయారు చేయడం ఇండియన్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మామూలుగా బంగ్లాదేశ్ జట్టు మీద మన వాళ్లకు ధ్వేష భావం ఏమీ ఉండదు. వారిని మన మిత్రులుగానే చూస్తాం. కానీ అనుకోకుండా క్రికెట్లో కొంత ఎదిగేసరికి బంగ్లాదేశ్ వాళ్లను పట్టడం కష్టమైపోతోంది.
అనవసరంగా ఇలా చీప్ గా ప్రవర్తించి భారత అభిమానులతో కయ్యం పెట్టుకుంటున్నారు బంగ్లాదేశీయులు. 2015 వన్డే ప్రపంచకప్ కు ముందు కూడా బంగ్లా అభిమానులు ఇలాగే ఓవరాక్షన్ చేశారు. ఐతే క్వార్టర్ ఫైనల్లో బంగ్లాను చిత్తు చిత్తుగా ఓడించి బంగ్లా అభిమానుల నోళ్లు మూయించింది టీమ్ ఇండియా. ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లోనూ బంగ్లాకు అలాగే పంచ్ ఇస్తుందేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/