అనితకు బ్యాంకు జప్తు నోటీసు

Update: 2022-09-10 07:31 GMT
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆస్తులను జప్తు చేస్తామంటు బ్యాంకు నోటీసులిచ్చింది. 2015లో తీసుకున్న అప్పును అనిత చెల్లించలేదు. దాంతో అప్పు చెల్లించేందుకు ఆమెకు బ్యాంకు రెండు నెలలు వ్యవధి ఇచ్చింది.

ఒకవేళ 2 నెలల్లో అప్పు చెల్లించకపోతే అప్పుకోసం తనఖా పెట్టిన ఆస్తులను జప్తు చేస్తామంటు నోటీసులో బ్యాంకు హెచ్చరించింది. మొన్నటికిమొన్న చనిపోయిన టీడీపీ నేత సబ్బంహరి అప్పు రికవరీకి కూడా బ్యాంకు ఆస్తుల జప్తునోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇంతకీ ఏమి జరిగిందంటే తన ఆస్తులను తనఖాపెట్టి అనిత 2015లో కర్నాటక బ్యాంకు నుండి రు. 82 లక్షలు అప్పుతీసుకున్నారు. అప్పయితే తీసుకున్నారు కానీ దాన్ని తిరిగి చెల్లించలేదు. అప్పుకోసం ఇంటిని, రెండు ఖాళీస్ధలాలను అనిత బ్యాంకులో కుదవపెట్టారట.

బహుశా తీసుకున్న రు. 82 లక్షల అప్పు వడ్డీతో కలిసి ఇపుడు సుమారు కోటి రూపాయలకు చేరుంటుంది. అప్ప రికవరీ కోసం బ్యాంకు ఎన్నిసార్లు నోటీసులిచ్చినా మహిళా నేత స్పందించలేదని సమాచారం.

దాంతో ఫైనల్ నోటీసున్నట్లుగా కర్నాటక బ్యాంకు నుండి అనితకు ఆస్తుల జప్తునోటీసు జారీఅయ్యింది. తీసుకున్న అప్పు చెల్లించే విషయంలోను, నోటీసుకు సమాధానాలు ఇవ్వటంలోను మహిళా నేత నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఈనెల 1వ  తేదీన ఏకంగా పేపర్ నోటిఫికేషనే ఇచ్చేసింది. 2 నెలల్లో అప్పు తీర్చకపోతే కుదవపెట్టిన ఆస్తులను జప్తుచేయటంతో పాటు వేలంవేసి తమ అప్పును రాబట్టుకుంటామని సదరు నోటీసులో స్పష్టంగా ఉంది.

దాదాపు ఇలాంటి నోటీసే ఈ మధ్య సబ్బంహరికి కూడా విశాఖ కో ఆపరేటివ్ బ్యాంకు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో తీసుకున్న రు. 8.5 కోట్ల అప్పు చెల్లించని కారణంగా ఆస్తి జప్తు నోటీసును బ్యాంకు సబ్బం కుటుంబసభ్యులకు జారీచేసింది. గడువులోగా అప్పు చెల్లించకపోతే వేలంవేస్తామని బ్యాంకు హెచ్చరించింది. ఆ మధ్య మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా ఒక బ్యాంకు ఇలాంటి ఆస్తి జప్తు+వేలం నోటీసిచ్చిన విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News