మందుబాబులకు ఇబ్బంది కలగకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవటంలో తెలంగాణ సర్కారు ఉంటుందన్న విమర్శ ఉంది. చీప్ లిక్కర్ ప్రతిపాదన మొదలు.. ఈ మధ్యనే వందకు పైగా విదేశీ బ్రాండ్ల మద్యాన్ని తెప్పించే సత్తా ఉన్న వారికి లిక్కర్ బొటిక్ లు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు.. బార్లు.. మరో గంట పాటు తమ కార్యకలాపాలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలన్న ఫైలు ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం కోసం ఎదురుచూస్తుంది.
ఇప్పుడు అనుసరిస్తున్న విధానంలో ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు.. అదే సమయంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ బార్లు అందుబాటులో ఉంటున్నాయి.
అయితే.. రెండింటికి గంట చొప్పున సమయం పెంచాలంటూ ఎక్సైజ్ శాఖ కోరుతుంది. దీంతో.. రాత్రి వేళ మరో గంట ఎక్కువగా వీటిని అందుబాటులోకి ఉంచేలా ముఖ్యమంత్రి ఓకే చెప్పాలని అధికారులు కోరుకుంటున్నారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు.. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించటంతో.. వివిధ రాష్ట్రాల్లో ఏయే సమయాల్లో వైన్.. బార్లు తెరిచి ఉంచుతున్నారన్న అంశంపై దృష్టి సారించిన అధికారులు.. మరో గంట అదనంగా అందుబాటులోకి తెచ్చిన పెద్ద ఇబ్బంది కాదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దీంతో.. వైన్.. బార్లు మరో గంట అదనంగా తెరిచి ఉంచేలా తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న టైమింగ్స్ చూస్తే..
ముంబయి.. నయా ముంబయి.. థానేలలో ; బార్లు ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు వైన్ షాపులు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు.
ఫుణె.. నాగపూర్.. నాసిక్ లలో ; బార్లు ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు.. వైన్ షాపులు ఉదయం ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు
ఒడిసాలో ; బార్లు మధ్యాహ్నం 12 నుంచి అర్థరాత్రి 1.30గంటల వరకు.. వైన్ షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10.30 గంటల వరకు
ఢిల్లీలో ; బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 12.30 వరకు.. వైన్ షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు
చెన్నైలో ; సాయంత్రం 7.30 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు.. వైన్ షాపులు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు.
కేరళలో; బార్లు లేవు. వైన్ షాపులు మాత్రం ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు.
ఈ నేపథ్యంలో.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ గంటలే తెరిచి ఉంటున్నట్లుగా అధికారుల వాదన ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకునే వీలుందని తెలుస్తోంది. అదే.. జరిగితే మరోసారి విమర్శలతో విరుచుకుపడేందుకు విపక్షాలు కాచుకొని ఉన్నాయి. మరి.. ముఖ్యమంత్రి సంతకం ఫైలు మీద ఎప్పుడు పడుతుందో..?