బాబు బ్యాడ్ డే కు 15 ఏళ్లు....

Update: 2015-08-28 06:44 GMT
తూటాలకు వెరవని ఎర్రదండు ఆవేశం ఒక‌వైపు....పేలిన తూటాలు, విరిగిన లాఠీలు, నెత్తురోడిన రోడ్లు మ‌రోవైపు. స‌రిగ్గా 15 ఏళ్ల కింద‌ట హైద‌రాబాద్‌ లోని బ‌షీర్ బాగ్‌లో ఇది ప‌రిస్థితి. అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్ర‌భుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ ఛార్జీలు పెంచింద‌ని...పాలకుల మెడలు వంచేందుకు లెఫ్ట్ పార్టీలు కీల‌కంగా....ప్ర‌తిప‌క్షాలంతా పాత్ర‌దారులుగా ఛ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఆ క్ర‌మంలో బ‌షీర్‌ బాగ్ వ‌ద్ద జ‌రిగిన‌ విద్యుత్ కాల్పుల ఘ‌ట‌న‌ జ‌రిగి నేటికి 15 ఏళ్లు.

తెలుగు రాష్ట్రాల చరిత్రలో, దేశ ఉద్యమ ప్రస్థానంలో విప్లవాక్షరాలతో లిఖించదగిన ఘటనగా బషీర్‌ బాగ్ పోరాటాన్ని క‌మ్యూనిస్టులు భావిస్తుంటారు. చంద్ర‌బాబు అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచార‌ని, ఆయ‌న్ను గ‌ద్దె దించేవ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని ఎర్ర‌సైనికులు స‌హ ఆ ప్ర‌తిప‌క్షాలు ర్యాలీ మొద‌లుపెట్టారు. ఈ ర్యాలీ బ‌షీర్‌ బాగ్ వ‌ద్ద‌కు చేరుకోగా ఉద్రిక్తంగా మారింది.  పోలీసుల కాల్పులతో బషీర్‌ బాగ్ నెత్తురోడింది. బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణ పోలీసు తూటాలకు తీవ్రంగా గాయపడి...ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

బషీర్‌ బాగ్‌ కాల్పులకు ఆగస్టు 28తో 15 ఏళ్లు నిండిన సంద‌ర్భంగా అమరులైన వీరుల స్మృతి చిహ్నం వ‌ద్ద లెఫ్ట్ పార్టీలు తాజాగా నివాళి అర్పించాయి. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా సాగిన పోరాటాల‌న్నింటిలో బ‌షీర్‌ బాగ్ కీల‌క‌మైన‌దిగా రాజకీయ‌ విశ్లేష‌కులు చెప్తుంటారు. ఆ కాల్పుల ఘ‌ట‌న‌తోనే బాబ‌కు ప‌ద‌వీగండం షురూ అయింద‌ని విశ్లేషిస్తుంటారు.

Tags:    

Similar News