కరోనా జంతువును ఇండియా లో తింటున్నారా?

Update: 2020-05-03 11:10 GMT
ప్రపంచంలో ఎక్కడ లేని వింత ఆహారపు అలవాట్లు చైనా వారికి ఉంటాయి. అక్కడ బొద్దింకల నుండి మొదలుకుని గబ్బిలాల వరకు క్రిమి కీటకాలు.. జంతువులు.. పాములను కూడా వారు తింటూ ఉంటారు. వాళ్లు చెత్త చెదారం తినడం వల్లే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేసే పరిస్థితి ఏర్పడినది. చైనాలోని వూహాన్‌ లో గబ్బిలాలను తినడం వల్లే ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రభలింది అంటూ చాలా మంది అనుకుంటున్నారు. అదే నిజం అయ్యి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు.

గబ్బిలాలను కొందరు చూడ్డానికే భయపడతారు. మరికొందరు గబ్బిలాలను అశుభంగా భావిస్తారు. చైనీలు మాత్రమే గబ్బిలాలను ఆహారంగా చూశారు. గబ్బిలాలను చైనాలో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా ఒక ప్రాంతంలో తింటారట. నాగాలాండ్‌ లోని మిమి అనే ప్రాంతంలో ఒక పండుగ సందర్బంగా ప్రత్యేకంగా గబ్బిలాలనే తింటారట. ఆ పండుగ ప్రత్యేకతే గబ్బిలాలను తినడం అంటున్నారు.

అత్యంత విచిత్రమైన వారి పద్దతి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. పూర్వ కాలం నుండి ఆ ప్రాంతంలో గబ్బిలాలను తినడం ఆనవాయితిగా వస్తుందట. కరోనా నేపథ్యంలో ఇప్పుడు వారి గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది. మిమి ప్రాంత పూర్వికులు ఏడాదిలో ఒక రోజు గబ్బిలం మాంసం తింటే ఆరోగ్యంగా ఉంటామని భావించి ఈ పండుగ మొదలు పెట్టారట.

ఆరోగ్యం కోసంమే తాము ఏడాదిలో ఒక్కసారి గబ్బిలం మాసంను తింటామంటూ మిమి ప్రాంత వాసులు అంటున్నారు. చైనా వారు మాసంను ఉడకబెట్టకుండా తినడం వల్ల కరోనా వచ్చింది. కాని వీళ్లు మాత్రం కూరగా వండుకుని తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదట. తినడం ఏమోకాని కరోనా వచ్చిన తర్వాత గబ్బిలంను చూస్తుంటనే చాలా మంది భయపడుతున్నారు.
Tags:    

Similar News