ఢిల్లీ నుండి అమెరికా లోని నెవార్క్ కి పయనమైన ఓ విమానం , టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ ల్యాండ్ అయింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి నెవార్క్ కు శుక్రవారం తెల్లవారు జామున 2.20 గంటలకు ఎయిర్ ఇండియా (బీ777-300ఈఆర్) విమానం బయలుదేరింది. అరగంట ప్రయాణం తర్వాత విమానంలో గబ్బిలం ఉన్న విషయాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించాడు. సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి చేరవేశాడు. గబ్బిలాన్నికేబిన్ లోపల సిబ్బంది గుర్తించడంతో అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. అధికారాల అనుమతి తో తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడు.
ఉదయం 3.55కి విమానం ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ స్టాఫ్ ను పిలిపించడంతో, వారు ఆ గబ్బిలాన్ని పట్టుకుని తీసుకెళ్లారని డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో పొగలు వచ్చాయని, బిజినెస్ క్లాస్ ఏరియాలో గబ్బిలం మృతి చెందిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. విమానంలోకి గబ్బిలం ఎలా వచ్చిందన్న దానిపై ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు జరపనుంది. కేటరింగ్ వాహనాల ద్వారా విమానంలోకి గబ్బిలం చొరబడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత విమానంలోని ప్రయాణికులను మరో విమానంలోకి తరలించారు. ఆ విమానం నెవార్క్‌లో ఉదయం 11.35 గంటలకు ల్యాండ్ అయినట్టు అధికారులు తెలిపారు.