భారీతనం - ప్రత్యేకతకు తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కేరాఫ్ అడ్రస్ అనే సంగతి తెలిసిందే. ఉన్న సచివాలయం బదులుగా కొత్త సచివాలయం కట్టే ప్రణాళిక అయిన...రవీంద్ర భారతి బదులుగా ఇంకో కళాక్షేత్రం నిర్మించాలన్నా...బడా క్యాంప్ ఆఫీసు కట్టుకోవాలన్నా అది కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రి నివాసాన్ని పక్కనపెట్టేసి బుల్లెట్ ప్రూఫ్ నివాసం కట్టుకోవడం వంటివి కేసీఆర్ కే సాధ్యం. అలాంటి కేసీఆర్ ఇంట ఆయన కూతురుకు ఎంపీ కవితకు కేరాఫ్ అడ్రస్ అయిన బతుకమ్మ పండగ నిర్వహస్తే ఎలాం ఉంటుంది? ప్రత్యేకంగానే ఉంటుంది అంటారా? అవును మరి.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ లో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని అనుకోకండి. ఆయన తనయ, ఎంపీ కవితతో పాటుగా మంత్రుల సతీమణులు - కుమార్తెలు - కోడల్లు హాజరయ్యారు. వీరితోపాటుగా గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ - యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా సహా పలువురు పార్టీ మహిళా నేతలు సైతం హాజరయ్యారు. వీరంతా కోలాహళంగా ఆడిపాడారు. ఇలా సీఎం కేసీఆర్ ఇంట బతుకమ్మ సంబురం అంటే ప్రత్యేకతను సంతరించుకునేలా చేశారు.
అయితే ఇలా పార్టీకి చెందిన మంత్రుల సతీమణులు ఒక్కచోట బతుకమ్మ ఆడటమే విశేషం అనుకోకండి. ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో పనిచేసే ఉద్యోగుల సతీమణలు - మహిళా ఉద్యోగులు సైతం వీరందరితో కలిసి బతుకమ్మ ఆడారు.