ఛీ వీళ్లు ఇక మారరా..! గబ్బిలాలు ఇష్టంగా తింటున్న ఇండినేషియా వాసులు !

Update: 2020-12-13 10:30 GMT
ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం అవుతున్నది. త్వరలోనే వ్యాక్సిన్​ వచ్చేస్తుందంటూ ప్రకటనలు వస్తున్నా.. ఇంకా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్​ కార్యరూపం దాల్చలేదు. అందరికీ అది చేరేందుకు సమయం పట్టేలా ఉంది. అయితే కరోనా వైరస్​ మొట్టమొదట చైనాలోని వూహాన్​ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే. అక్కడి వైరాలజీ ల్యాబ్​లో పుట్టిందని కొందరు.. లేదు అక్కడి మాంసం దుకాణాల్లోనుంచే పుట్టిందని మరికొందరు వాదించారు.

అయితే వూహాన్​ మాంసం దుకాణాల్లో అమ్మే గబ్బిలాల వల్లే కరోనా వచ్చిందని వార్తలు వచ్చాయి. దీంతో చాలా చోట్ల గబ్బిలాలు తినడాన్ని ఆపేశారు. అయితే తాజాగా ఇండోనేషియాలో మాత్రం జోరుగా గబ్బిలాల విక్రయం జరుగుతున్నది. ప్రజలు ఇష్టంగా గబ్బిలాల మాంసాన్ని కొనగోలు చేస్తున్నారు. పలు హోటళ్లల్లోనూ గబ్బిలాల మాంసం, మాంసంతో తయారు చేసిన సూప్​ విరివిగా దొరుకుతోంది. గబ్బిలాల కోసం ప్రస్తుతం అడవుల్లో వేట మొదలుపెట్టారు. గబ్బిలాల రెక్కలు కట్​చేసి.. మార్కెట్​లో అమ్మేస్తున్నారు. ఇండోనేషియాలో ప్రజలు కూడా గబ్బిలాల మాంసం ఎంతో ఇష్టంగా తింటున్నారట.

అయితే ఈ విషయంపై మార్కెట్​లోని వ్యాపారులు మాట్లాడుతూ.. గబ్బిలాల మాంసం అమ్మొద్దని తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ప్రజలు కొనుగోలు చేస్తుండటంతో తాము విక్రయిస్తున్నామన్నారు. ఇండోనేషియాలోని లాంగోవున్ మార్కెట్లో పాములు, బల్లులు, ఎలుకలు, అడవి పందుల మాంసాలు యథేచ్ఛగా అమ్ముతుంటారు. అయితే కరోనా వచ్చిన కొత్తలో ప్రజలు గబ్బిలాల మాంసం తినేందుకు భయపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం లొట్టలేసుకుంటూ ఈ మాంసాన్ని ఆరగిస్తున్నారట.


Tags:    

Similar News