రాష్ట్ర ఖజానా దివాలా తీసిన సంస్థను మరిపిస్తుంటే..!

Update: 2018-02-05 13:56 GMT
రాష్ట్ర‌విభ‌జ‌న జ‌రిగి క‌ష్టాల క‌డ‌లిలో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను ఆదుకోండంటూ సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల మీద ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌లకు గాలిలో మేడ‌లు క‌ట్టిస్తున్నారు. ఓ వైపు ఖజానా చూస్తే దివాలా తీసిన సంస్థను మరిపిస్తున్నా సింగ‌పూర్ - దుబాయ్ అంటూ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల్ని క‌ల‌ల్లో ముంచేస్తున్నారు. కోట్లు ఖ‌ర్చు చేసి రాజ‌ధాని శంకుస్థ‌పాన చేశారు. మ‌రి ఆ నిర్మాణం ఎంత‌వ‌ర‌కు వ‌చ్చిందో తెలియ‌దుగాని ప్ర‌జాధ‌నాన్ని నీళ్ల ప్రాయం చేయ‌డానికి చంద్ర‌బాబు ముందుంటార‌ని అంటున్నారు ఏపీ స‌చివాల‌యానికి వ‌చ్చే సంద‌ర్శ‌కులు .

వెలగపూడిలో ఏపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయాన్నిరూ. 180 కోట్లతో నిర్మించింది. అక్క‌డి నుంచే రాష్ట్ర‌పరిపాల‌న కొన‌సాగుతుంది. అయితే స‌చివాల‌యానికి వ‌చ్చే వారి కోసం ప్ర‌భుత్వం ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి బ్యాట‌రీ ఆటోల‌ను ఏర్పాటు చేసింది. వాటిని అవ‌స‌రం ప‌క్క‌న పెట్టేస్తే . అవి ఉప‌యోగం లేక మూల‌న‌ప‌డ్డాయి. చెడిపోయిన వాటిని రిపేర్ చేసి సాధార‌ణస్థితికి తెచ్చే అవ‌స‌రం ఉన్నా వాటిని ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డంలేదు.    

 ఏపీ ప్ర‌భుత్వం ఉద్యోగ‌ల కోసం స‌చివాల‌యంలో  12 బ్యాటరీ ఆటోలను ఏర్పాటు చేసింది. వాటిలో ప్ర‌స్తుతం రెండే ప‌నిచేస్తున్నాయి. వాటిలో రెండు చిన్న ఆటోలు -రెండు పెద్ద ఆటోలు . మిగిలిన 8 ఆటోలు ఏపీ సెక్ర‌ట‌రియేట్ వెనుక భాగంలో నిరుప‌యోగంగా వెక్కిరిస్తున్నాయి. సంబంధిత అధికారుల్ని ప్ర‌శ్నిస్తే కొత్త టెక్నాల‌జీతో ఉన్న ఈ ఆటోల్ని రిపేరే చేసే నాధుడే లేడ‌ని చేతులు దులిపేసుకుంటున్నారు. చెడిపోయిన వాటిని త్వ‌ర‌లో రిపేర్ చేయించి అందుబాటులోకి తెచ్చేలా ప్ర‌య‌త్నిస్తామ‌ని అంటున్నారు.  మ‌రి స‌చివాల‌యానికి వ‌చ్చే ప‌రిస్థితి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స‌చివాల‌యం ప్రారంభ గేటు నుంచి లోప‌లికి వ‌చ్చే స‌రికి త‌ల‌ప్రాణం తోక‌కొస్తుందిని వృద్దులు - విక‌లాంగులు తిట్టిపోస్తున్నారు.
Tags:    

Similar News